IND vs AUS 1st Test : సత్తా చాటిన రోహిత్ సెంచరీతో రికార్డ్
నాగపూర్ లో కొనసాగుతున్న టెస్టు
IND vs AUS 1st Test : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయినా ఎక్కడా తగ్గకుండా స్కోర్ ను పెంచే ప్రయత్నం చేశాడు. ఓ వైపు ఆసిస్ బౌలర్లు కట్టడి చేసినా మరో వైపు పరుగులు చేస్తూ పోయాడు హిట్ మ్యాన్. తన కెరీర్ లో తొమ్మిదో టెస్టు సెంచరీ చేశాడు.
తొలి రోజు కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసిన భారత్ రోహిత్ శర్మ 56 పరుగులతో ప్రారంభించాడు. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ తో పాటు విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు ఆశించిన మేర రాణించలేక పోయారు. దీంతో క్రీజులో ఉన్న కెప్టెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్(IND vs AUS 1st Test) ఆడాడు.
తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన రవీంద్ర జడేజా తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 10 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. ఇక రవిచంద్రన్ అశ్విన్ 62 బంతులు ఆడి 23 పరుగులు చేశాడు. దూకుడుగా ఉన్న ఛతేశ్వర్ పుజారాను మర్పీ బోల్తా కొట్టించాడు. రెండో రోజు మొదటి సెషన్ ముగిసే సమయానికి రోహిత్ 142 బంతుల్లో 85 పరుగులతో ఉండగా కోహ్లీ 25 బంతుల్లో 12 రన్స్ చేశాడు.
అనంతరం రోహిత్ శర్మ(Rohit Sharma) తన 9వ టెస్ట్ సెంచరీని 14 ఫోర్లు 2 సిక్సర్లతో సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 5 వికెట్లు కోల్పోయి 2226 రన్స్ చేసింది. క్రీజులో 118 పరుగులతో రోహిత్ శర్మ ఉండగా రవీంద్ర జడేజా 34 రన్స్ తో క్రీజులో ఉన్నాడు. ఇంకా రెండో రోజు ముగిసేందుకు టైం ఉంది.
Also Read : కోహ్లీ ఆట తీరుపై మార్క్ వా కామెంట్స్