IND vs AUS 1st Test : 400 ర‌న్స్ కు భార‌త్ ఆలౌట్

రెచ్చి పోయిన జ‌డేజా..అక్స‌ర్

IND vs AUS 1st Test : నాగ్ పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టుపై భార‌త్ ప‌ట్టు బిగించింది. మొద‌టి ఇన్నింగ్స్ లో 177 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన భార‌త్ బ్యాటింగ్ లో దుమ్ము రేపింది.

తొలి ఇన్నింగ్స్ లో 400 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడ‌గా ఆసిస్ ను త‌న అద్భుత‌మైన బౌలింగ్ తో క‌ట్ట‌డి చేసిన ర‌వీంద్ర జ‌డేజా అలియాస్ జిడ్డూ మ‌రో భార‌త(IND vs AUS 1st Test)  పేస‌ర్ అక్స‌ర్ ప‌టేల్ లు క‌లిసి భారీ స్కోర్ చేసేలా కీల‌క పాత్ర పోషించారు.

దీంతో ఆసిస్ పై 223 ప‌రుగుల భారీ ఆధిక్యాన్ని క‌న‌బ‌ర్చింది భార‌త్. రోహిత్ శ‌ర్మ 212 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 120 ర‌న్స్ చేశాడు. త‌న టెస్టు కెరీర్ లో 9వ టెస్టు సెంచ‌రీ చేశాడు. మ‌ధ్య‌లో వ‌చ్చిన ర‌వీంద్ర జ‌డేజా 185 బంతులు ఎదుర్కొని 70 ప‌రుగులు చేశాడు.

ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. ఇక తొమ్మిదో ప్లేస్ లో వ‌చ్చిన స్టార్ పేస‌ర్ అక్స‌ర్ ప‌టేల్ 174 బంతులు ఎదుర్కొని 84 ర‌న్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఇద్ద‌రు బౌల‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. దీంతో స్కోర్ బోర్డు ప‌రుగులు తీసింది. 

అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన మ‌రో స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ 47 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 37 ర‌న్స్ చేశాడు. ఈ మొత్తం భార‌త ఇన్నింగ్స్ లో రోహిత్ శ‌ర్మ‌, జ‌డేజా, ప‌టేల్ , ష‌మీ మాత్ర‌మే బాగా ఆడారు. మిగ‌తా ఆట‌గాళ్లు చేతులెత్తేశారు. విరాట్ కోహ్లీ సైతం తీవ్ర నిరాశ‌కు గురి చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాపై భార‌త్ గెల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Also Read : ఉత్కంఠ పోరులో శ్రీ‌లంక విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!