IND vs AUS 1st Test Win : భారత్ భళా ఆస్ట్రేలియా విలవిల
చెలరేగిన బౌలర్లు తలవంచిన కంగారూలు
IND vs AUS 1st Test Win : నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట ఉండగానే కథ కానిచ్చేసింది. స్పిన్నర్లకు స్వర్గధామంగా పేరు పొందిన ఈ మైదానంలో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు కంగారూలు.
19 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది టీమిండియా. ఆసిస్ మొదటి టెస్టులో పర్యాటక జట్టు కేవలం 91 పరుగులే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులు చేసినా రెండో ఇన్నింగ్స్ లో ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది.
దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా భారత స్పిన్నర్ల ధాటికి పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. నాలుగు టెస్టుల సీరీస్ లో భాగంగా టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో(IND vs AUS 1st Test Win) నిలిచింది. 132 పరుగుల తేడాతో ఆసిస్ ఓటమి మూటగట్టుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు , రవి చంద్రన్ అశ్విన్ 3 వికెట్లు , సిరాజ్ , షమీ చెరో వికెట్ తీశారు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు రవి చంద్రన్ అశ్విన్ , జడేజాలు. ఈసారి అశ్విన్ 5 వికెట్లు కూల్చితే జడేజా 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒకటి, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. ఇక ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఆసిస్ జట్టులో లాబుషేన్ 17, డేవిడ్ వార్నర్ 10, కారీ 10 రన్స్ చేశారు. మర్పీ 2 రన్స్ చేశాడు. కమిన్స్ ఒక పరుగుతో సరి పెట్టాడు. కాంబ్ 6 రన్స్ చేస్తే రాన్ షా 2 , ఉస్మాన్ ఖవాజా 5 పరుగులు చేశారు.
Also Read : 400 రన్స్ కు భారత్ ఆలౌట్