WPL vs PSL : పాక్ క్రికెట‌ర్ల కంటే మ‌నోళ్ల‌కే ఎక్కువ

ఉమెన్ ఐపీఎల్ లో మ‌హిళ‌ల రికార్డ్

WPL vs PSL : ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారిగా ఉమెన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ )ను మార్చిలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించి 5 ఫ్రాంచైజీలు ఎంపిక‌య్యాయి. ఒక్కో జ‌ట్టులో క‌నిష్టంగా 15 మంది గ‌రిష్టంగా 18 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా తాజాగా ముంబై వేదిక‌గా నిర్వ‌హించిన మ‌హిళ‌ల ఐపీఎల్ వేలం పాట ముగిసింది. 1525 మంది పేర్లు న‌మోదు చేసుకోగా ఇందులో 409 మందిని ఎంపిక చేసింది బీసీసీఐ.

వీరిలో 87 మందిని ఎంపిక చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. విచిత్రం ఏమిటంటే పురుషుల క్రికెట‌ర్ లతో పాటు భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు దుమ్ము రేపారు. వేలం పాట‌లో కోట్లు కొల్ల‌గొట్టారు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయింది ముంబైకి చెందిన స్మృతి మంధాన‌. 

ఏకంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ ) 3.40 కోట్ల‌కు చేజిక్కించుకుంది. విచిత్రం ఏమిటంటే ప‌లువురు మ‌హిళా క్రికెట‌ర్లు పాకిస్తాన్ సూప‌ర్ లీగ్(WPL vs PSL) లో ఆడే టాప్ క్రికెట‌ర్ల కంటే ఎక్కువ ధ‌ర ప‌ల‌క‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 5 ఫ్రాంచైజీలు 87 మందిపై రూ. 59.50 కోట్లు ఖ‌ర్చు పెట్టాయి. 20 మంది ఆట‌గాళ్లు కోటి కంటే ఎక్కువ‌గా వేలం పాటలో అమ్ముడు పోయారు. వీరిలో 15 మంది ఆట‌గాళ్ల వేత‌నం పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో(WPL vs PSL) ఆడుతున్న బాబ‌ర్ ఆజ‌మ్ , షాహీన్ అఫ్రిది, రిజ్వాన్ వంటి త‌దిత‌ర ఆట‌గాళ్ల కంటే ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం. బాబ‌ర్ ఆజ‌మ్ కు గ‌రిష్టంగా కేవ‌లం రూ. 1.40 కోట్లు మాత్ర‌మే అందుతున్నాయి.

Also Read : మ‌ల్లికా సాగ‌ర్ సూప‌ర్ – కార్తీక్

Leave A Reply

Your Email Id will not be published!