Chetan Sharma Pandya : భవిష్యత్తులో పాండ్యానే కెప్టెన్
స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ
Chetan Sharma Pandya : భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ హాట్ టాపిక్ గా మారాడు. ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా సంచలన కామెట్స్ చేశాడు. జట్టు ఎంపిక విషయం, ఆటగాళ్లు ఎంపిక, నకిలీ ఇంజెక్షన్లు తీసుకోవడం, సంజూ శాంసన్ ఫ్యాన్స్ వ్యవహారంతో పాటు రాబోయే కాలంలో హార్దిక్ పాండ్యా ఎలా జట్టుకు పూర్తి కాలపు కెప్టెన్ అవుతాడనే తదితర కీలక విషయాల గురించి జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించాడు. తాను ముందు వెనుకా ఆలోచించకుండా అన్నింటి గురించి నోరు జారాడు. ప్రస్తుతం తన పదవికి తానే ముప్పు తెచ్చుకున్నాడు చేతన్ శర్మ(Chetan Sharma Pandya).
ఫిట్ నెస్ ఉన్నామని చెప్పేందుకు ఆటగాళ్లు నకిలీ ఇంజెక్షన్లు తీసుకుంటారని సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు బీసీసీఐని తీవ్ర ఇరకాటంలో పడేసింది. అంతే కాదు కొంత మంది స్టార్ ఆటగాళ్ల పట్ల బీసీసీఐ మెతక వైఖరిని ప్రదర్శిస్తోందంటూ ఆరోపించాడు చేతన్ శర్మ.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. బీసీసీఐని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. ఇక భారత జట్టు కెప్టెన్సీ విషయంలో కూడా కుండ బద్దలు కొట్టాడు. హార్దిక్ పాండ్యా వెనుక బలమైన లాబీ ఉందన్నాడు(Chetan Sharma Pandya). అంతే కాదు భవిష్యత్తులో భారత జట్టుకు అతడే సారథి కావడం ఖాయమంటూ జోష్యం చెప్పాడు చేతన్ శర్మ.
డోపింగ్ లో చిక్కకుండా కొందరు ఆటగాళ్లు నకిలీ ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. చేతన్ శర్మ చేసిన ఆరోపణలతో బీసీసీఐ రంగంలోకి దిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తోంది.
Also Read : ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు