NIA Raids South States : కేరళ..కర్ణాటకలో ఎన్ఐఏ దాడులు
తమిళనాడులో కూడా సోదాలు
NIA Raids South States : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో దాడులు చేపట్టింది. బుధవారం ఉదయం పేలుళ్ల కేసులపై కేరళ, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. తెల్లవారుజామున పలు ప్రాంతాలలో దర్యాప్తులో ఉన్న రెండు వేర్వేరు పేలుళ్ల కేసులలో ఏఎన్ఐ దాడులు చేపట్టింది. ఐఎస్ఐఎస్ సానుభూతి పరులపై భారీ అణిచివేతలో భాగంగా దాడులు ప్రారంభించింది.
ఎలైట్ యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ లోని మూలాల ప్రకారం గత ఏడాది తమిళనాడులో లోని కోయంబత్తూర్ , కర్ణాటక లోని మంగళూరులో వరుసగా అక్టోబర్ 23, 2022, నవంబర్ 19, 2022న జరిగిన పేలుళ్లకు సంబంధించి సోదాలు(NIA Raids South States) జరుగుతున్నాయి. తమిళనాడు లోని కొడుంగయ్యూర్ , కేరళ లోని మున్నాడితో సహా మూడు రాష్ట్రాల్లోని దాదాపు 60 ప్రదేశాలలో ఏక కాలంలో దాడులు చేసినట్లు సమాచారం.
గత ఏడాది అక్టోబర్ 23న తమిళనాడు లోని కోయంబత్తూరు జిల్లా కొట్లై ఈశ్వరన్ ఆలయం ముందు పేలుడు పదార్థాలు నింపిన కారులో బాంబు పేలుడు ఘటనపై ఎన్ఐఏ గత ఏడాది అక్టోబర్ 27న దర్యాప్తు ప్రారంభించింది. తమిళనాడు పోలీసులు తొలుత ఫిర్యాదు నమోదు చేసిన కేసులో 11 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
ఇదే సమయంలో నవంబర్ 19న మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. షరీక్ అనే ప్రయాణికుడు ఇఇడితో తయారు చేసిన ప్రెషర్ కుక్కర్ బాంబును తీసుకు వెళుతుండగా పట్టుకున్నారు.
Also Read : బీబీసీ ఆఫీసుల్లో ఐటీ మరోసారి దాడి