IT Raids BBC Offices : బీబీసీ ఆఫీసుల్లో ఐటీ మ‌రోసారి దాడి

రెండో రోజు కూడా ఢిల్లీ, ముంబైలలో

IT Raids BBC Offices : కేంద్ర ఆదాయ ప‌న్ను శాఖ రెండో రోజు బీబీసీ ఆఫీసుల్లో దాడులు చేప‌ట్టింది. నిన్న సోదాలు చేసి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు స్వాధీనం(IT Raids BBC Offices) చేసుకుంది. ఇదిలా ఉండ‌గా క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌లో భాగంగానే దాడుల‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టింది ఐటీ శాఖ‌.

గ‌తంలో ప‌లుమార్లు బీబీసీకి నోటీసులు జారీ చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది. వాటిని ధిక్క‌రించినందుకు, నోటీసుల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌నందుకు సోదాలు చేయాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఇటీవ‌ల బీబీసీ మోదీ ది క్వ‌శ్చ‌న్ పేరుతో డాక్యుమెంట‌రీ ప్ర‌సారం చేసింది. 

దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ త‌రుణంలో సోదాలు చేప‌ట్ట‌డాన్ని కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు జైరాం ర‌మేష్ , మ‌హూవా మోయిత్రా తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పేర్కొన్నారు. మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు.

మ‌రో వైపు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. బీబీసీసై స్పందించిన ఐటీ, మోదీ స‌ర్కార్ మ‌రి అదానీ మోసాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన అమెరికా సంస్థ హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్ గ్రూప్ పై దాడుల‌కు పాల్ప‌డుతుందా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌ధాన‌మంత్రిని నిల‌దీశారు . ఈ త‌రుణంలో రెండో రోజు కూడా బీబీసీకి చెందిన ఆఫీసుల‌లో దాడుల‌కు పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై ఇంకా బీబీసీ ప్ర‌ధాన కార్యాల‌యం ఇంకా స్పందించ లేదు. అయితే తాము ఐటీ శాఖ‌కు స‌హ‌క‌రిస్తామ‌ని, అన్ని వివ‌రాలు అంద‌జేస్తామ‌ని తెలిపింది .

Also Read : బీబీసీ స‌రే హిండెన్ బ‌ర్గ్ పై దాడి చేస్తారా

Leave A Reply

Your Email Id will not be published!