BBC Raids Comment : స్వేచ్ఛపై పహారా మీడియాపై కన్నెర్ర
ప్రమాదంలో భారత దేశ ప్రజాస్వామ్యం
BBC Raids Comment : లక్ష తుపాకుల కన్న దట్టించిన కలం, కెమెరా చాలా ప్రమాదకరమైనది. అందుకే ప్రపంచంలో ఎక్కువగా దాడులకు గురవుతున్న రంగం ఏదైనా ఉందంటే అది మీడియా రంగమే. చరిత్రకు అందని, కెమెరాకు చిక్కని జర్నలిస్టులు ఎందరో రాలి పోయారు.
టెక్నాలజీ పెరిగినా , డిజిటల్ మీడియా డామినేట్ చేసినా ఇంకా ప్రతి చోటా దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఎక్కువగా పత్రికా స్వేచ్ఛపై పహారా కొనసాగుతూ ఉన్నది ఒక్క భారత దేశంలోనే.
తాజాగా బ్రిటన్ కు చెందిన అత్యున్నత మీడియా సంస్థగా పేరొందిన బీబీసీ(BBC Raids Comment) ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గురించి మోదీ ది క్వశ్చన్ పేరుతో రెండు ఎపిసోడ్స్ తో కూడిన డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది.
ఓ వైపు మోదీ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా వినుతికెక్కారు. గత కొంత కాలం నుంచీ టాప్ లో కొనసాగుతూ వస్తున్నారు. జనవరి 24న ఇది ప్రసారం అయ్యింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వెంటనే నిలిపి వేయాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా ఎక్కడ కూడా దానికి సంబంధించిన లింకులు ఉండ కూడదంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మోదీ ది క్వశ్చన్ డాక్యుమెంటరీపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ నాలుగో స్తంభం లాంటిదని, దానిని నియంత్రించలేమని పేర్కొంది.
అంతే కాదు బీబీసీ ప్రసారం చేసిన లేదా రూపొందించిన డాక్యుమెంటరీ వల్ల ఈ దేశంలో ఎంత మంది ప్రభావితం కాగలరని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను, డాక్యుమెంటరీ రికార్డులను తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆదాయపు పన్ను శాఖ రెండు రోజుల (ఫిబ్రవరి 14, 15) పాటు బీబీసీకి చెందిన ఢిల్లీ, ముంబై ఆఫీసులలో సోదాలు(BBC Raids Comment) చేపట్టింది.
ఇప్పటికే నోటీసులు జారీ చేశామని కానీ పట్టించు కోలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. దాడులలో భాగంగా సిబ్బందికి చెందిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు కూడా స్వాధీనం చేసుకుంది.
ఈ మొత్తం వ్యవహారంపై బీబీసీ(BBC) మీడియా కూడా స్పందించింది. తాము ఐటీ శాఖకు సహకారం అందజేస్తామని స్పష్టం చేసింది. ఇది పక్కన పెడితే ఏ ప్రభుత్వమైనా సరే మీడియాను గౌరవించాలి.
స్వేచ్ఛ అన్నది లేక పోతే చివరకు ఎవరు ప్రజల తరపున వాయిస్ వినిపించాలి. ఒక రకంగా ఇలా దాడులు చేసుకుంటూ పోతే దేశంలో మీడియా అన్నది మిగలదని హెచ్చరించారు మమతా బెనర్జీ.
ఏది ఏమైనా స్వేచ్చపై పహారా మీడియాపై కక్ష ఎప్పటికైనా ప్రమాదం ఉందని గ్రహించాలి. ఇదిలా ఉండగా బీజేపీ మాత్రం ప్రపంచం లోనే అత్యంత అవినీతి సంస్థగా అభివర్ణించింది.
మీరు విషం చిమ్మనంత కాలం ప్రతి సంస్థకు అవకాశం ఇచ్చే దేశం భారత దేశం అని పేర్కొంది. ఏది ఏమైనా ఇది ఒకరకంగా హెచ్చరిక లాంటిది.
మరింత ప్రమాదకరం మారకుండా ఉండేలా చూడాలంటే మనల్ని మనం పరిశీలించు కోక తప్పని పరిస్థితి నెలకొంది. స్వేచ్ఛ లేని చోట ఉండలేం. కెమెరా చూడని చోట వెళ్లాలని అనుకోవడం ప్రమాదం. మొత్తం మీడియా సమాజానికి వార్నింగ్.
Also Read : ప్రకటించిన రూ. 100 కోట్లు ఎక్కడ