Air India Record : 840 ఫ్లైట్స్ కు ఎయిర్ ఇండియా ఆర్డర్
ఏసీసీఓ నిపున్ అగర్వాల్ వెల్లడి
Air India Record : భారతీయ విమానయాన చరిత్రలో ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఓ మైలు రాయిగా అభివర్ణించారు ఎయిర్ లైన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్.
ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ , బోయింగ్ నుండి 370 ఫ్లైట్స్ తో సహా మొత్తం 840 విమానాలను ఆర్డర్ చేసిందని తెలిపారు. ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు.
ఈ మేరకు ఇదే ఆర్డర్ చేసిన విషయం గురించి నిపుణ్ అగర్వాల్ గురువారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కీలక అంశం గురించి ప్రస్తావించారు. ఆర్డర్ చేసిన వాటిలో 470 ఫర్మ్ ఎయిర్ క్రాఫ్ట్ లు, 370 ఎంపికలు , తదుపరి దశాబ్దంలో ఎయిర్ బస్ , బోయింగ్ నుండి కొనుగోలు హక్కులు ఉన్నాయని తెలిపారు.
ఇక ఎయిర్ బస్ సంస్థ ఆర్డర్ లో 210 ఏ – 320 / 321 నియో, ఎక్స్ ఎల్ ఆర్ , 40 ఏ 350 -900 /1000 ఉన్నాయి. బోయింగ్ సంస్థ ఆర్డర్ లో 190 -737 – మాక్స్ , 20 – 787 , 10 – 777 లు ఉన్నాయి. అంతే కాకుండా సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ , రోల్స్ రాయిస్ , జీఓ ఏరో స్పేస్ తో ఇంజిన్ ల దీర్ఘకాలిక నిర్వహణ కోసం కూడా ఒప్పందం చేసుకున్నట్లు నిపున్ అగర్వాల్ వెల్లడించారు.
ఎయిర్ ఇండియా , భారత విమానయాన చరిత్రలో (Air India Record) ఇది నిజంగా మైలు రాయి. 840 విమానాల ఆర్డర్ దాదాపు 2 సంవత్సరాల కిందట ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియతో ప్రారంభమైందని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఎయిర్ ఇండియాను వరల్డ్ క్లాస్ ఎయిర్ లైన్ గా మార్చేందుకు, ప్రపంచంలోని ప్రతి ప్రధాన నగరానికి భారత దేశాన్ని నాన్ స్టాప్ గా కనెక్ట్ చేయాలనే టాటా గ్రూప్ దృష్టి , ఆకాంక్షను ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ ప్రదర్శిస్తుందని నిపున్ అగర్వాల్ స్పష్టం చేశారు.
Also Read : బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు సోదాలు