Team India Asia Cup 2023 : ఆసియా క‌ప్ లో ఆడ‌నున్న భార‌త్

పాకిస్తాన్ లో కాదు దుబాయ్ లో

Team India Asia Cup 2023 : పాకిస్తాన్ లో నిర్వ‌హించే ఆసియా క‌ప్ పై క్లారిటి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆసియా క‌ప్ వివాదానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మ‌న్ న‌జామ్ సేథీ. ఈ మేర‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మ‌న్ జే షాతో జ‌రిగిన కీల‌క మీటింగ్ లో ఇరు బోర్డులు ఒక అంగీకారానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు ఆసియా క‌ప్ ను గ‌నుక పాకిస్తాన్ లో నిర్వ‌హిస్తే తమ జ‌ట్టు పాకిస్తాన్ లో ఆడ‌ద‌ని ఇప్ప‌టికే భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షా ప్ర‌క‌టించారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. 

కేవ‌లం భ‌ద్ర‌తా కారణాల రీత్యా మాత్ర‌మే తాము జ‌ట్టును పంపించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది పీసీబీ, బీసీసీఐ మ‌ధ్య‌. ఇందుకు పుల్ స్టాప్ పెట్టేందుకు జే షా ప్ర‌య‌త్నం చేశారు. టీమిండియా(Team India Asia Cup 2023) యూఏఈలో ఆడేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. భార‌త్ అర్హ‌త సాధిస్తే యూఏఈ ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

కొన్ని మ్యాచ్ ల‌ను నిర్వ‌హించేందుకు క్రికెట్ బోర్డు అంగీకారం తెలిపింది. ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింది ఆసియ‌న్ క్రికెట్ కౌన్సిల్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఫిబ్ర‌వ‌రి 4న . ఈ కీల‌క మీటింగ్ బ‌హ్రెయిన్ లో జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా పీసీబీ చైర్మ‌న్ న‌జామ్ సేథీ మీడియాతో మాట్లాడారు. ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై ఇంకా అనిశ్చితి తొల‌గ‌లేద‌న్నారు. కొన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లో మ‌రికొన్నింటిని యూఏఈలో నిర్వ‌హించేలా ప్లాన్ చేస్తోంది పీసీబీ.

Also Read : ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై ఓకే – న‌జామ్ సేథీ

Leave A Reply

Your Email Id will not be published!