Najam Sethi Asia Cup : ఆసియా కప్ నిర్వహణపై ఓకే – నజామ్ సేథీ
పాకిస్తాన్ ..యూఏఈలో మ్యాచ్ లు
Najam Sethi Asia Cup : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇప్పటికే ఆసియా కప్ వివాదం ప్రపంచ క్రికెట్ రంగాన్ని కుదిపేసింది. ఈ ఏడాది రెండు మెగా టోర్నీలకు దాయాది దేశాలు భారత్ , పాకిస్తాన్ లు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.
ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించాల్సి ఉంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరుణంలో భద్రతా కారణాల రీత్యా భారత్ పాకిస్తాన్ కు వెళ్లబోదంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదని ప్రకటించింది.
తమకు ఆట కంటే ఆటగాళ్ల ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొంది. ఈ తరుణంలో పీసీబీ సీరియస్ గా స్పందించింది. బీసీసీఐ నోరు పారేసుకుంది. మీరు మాతో ఆడక పోతే మేం వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనబోమంటూ ప్రకటించింది. దీనిని లైట్ గా తీసుకుంది క్రీడా శాఖ. తమతో ఆడని పక్షంలో ఎక్కువగా నష్ట పోయేది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటూ స్పష్టం చేసింది.
దీంతో మధ్యే మార్గాన్ని అవలంభించక తప్పలేదు పీసీబీకి. బెహ్రయిన్ లో ఈనెల 4న జరిగిన కీలక సమావేశంలో పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ ఓ కీలక ప్రతిపాదనలు చేశారు. ఆసియా కప్(Najam Sethi Asia Cup) నిర్వహణలో భాగంగా కొన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లో మరికొన్ని యూఏఈ వేదికగా జరిగేలా చూస్తామన్నారు. దీని వల్ల ఇబ్బందులు తొలగే ప్రమాదం ఉందన్నారు. ఏది ఏమైనా ఏసీసీ సమావేశం వాడి వేడిగా జరిగింది.
Also Read : భారత్ జోరు ఆస్ట్రేలియా బేజారు