AUSW vs SLW T20 World Cup : శ్రీలంక జోరుకు ఆసిస్ బ్రేక్
సెమీస్ కు చేరువలో ఆస్ట్రేలియా
AUSW vs SLW T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 మహిళల వరల్డ్ కప్ లో శ్రీలంక జోరుకు అడ్డుకట్ట పడింది. ఆస్ట్రేలియా మహిళా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సెమీ ఫైనల్ కు చేరువైంది. ఇప్పటికే కంటిన్యూగా ఆసిస్ మూడు మ్యాచ్ లలో గెలుపొందింది.
ఆ దేశంలో క్రికెట్ ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు. గ్కెబెర్హా లోని సెయింట్ జార్జ్ పార్క్ లో జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసింది. ఇక ఇదే మైదానంలో గ్రూప్ – ఎలో ఆఖరి లీగ్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆసిస్(AUSW vs SLW T20 World Cup) ఆడనుంది. దీంతో సెమీస్ కు చేరుకున్నట్టే.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా దెబ్బకు లంక ఠారెత్తింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 113 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఆసిస్ స్టార్ ప్లేయర్ హీలీ 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
మరో స్టార్ మిట్టర్ బెత్ మూనీ సూపర్ ఇన్నింగ్స్ తో సత్తా చాటింది. 56 పరుగులు చేసి చివరి వరకు నిలిచింది. దీంతో 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఇదిలా ఉండగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఎ , గ్రూప్ బి లో 5 జట్ల చొప్పున ఆడుతున్నాయి. గ్రూప్ బిలో భారత్, ఇంగ్లండ్ , గ్రూప్ ఏలో ఆసిస్ , శ్రీలంక సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఉందని అంచనా.
Also Read : భారత్ జోరు ఆస్ట్రేలియా బేజారు