Sadhguru Maha Shivaratri : చైతన్యానికి ప్రతీక శివరాత్రి – సద్గురు
ఈషా ప్రాంగణంలో శివరాత్రి పర్వదినం
Sadhguru Maha Shivaratri : నిత్య చైతన్యానికి ప్రతీక మహా శివరాత్రి. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. భారత దేశంలోని పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ శివుని అనుగ్రహాన్ని జరుపుకుంటుంది.
మొదటి గురువుగా శివుడిని పరిగణిస్తారు. భక్తులు ఆరాధిస్తారు. మానవ వ్యవస్థలో శక్తి ప్రాధాన్యత ఏమిటో ఈ పర్వదినం తెలియ చేస్తుందని అన్నారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు , ప్రముఖ సద్గురు జగ్గీ వాసుదేవన్(Sadhguru Maha Shivaratri) . రాత్రంతా నిలువు భంగిమలో మెలకువతో ఉండడం , జాగరూకతతో ఉండటం ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఎంతో ప్రయోజనమని పేర్కొన్నారు .
ఇక మహా శివరాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు అత్యంత ముఖ్యమైనదన్నారు. సరైన మంత్రాలు, ధ్యానాలతో దైవానికి చేరుకునేందుకు ఈ రాత్రి తోడ్పడుతుందన్నారు సద్గురు. ఒక వ్యక్తి జీవితంలో సాధన లేక పోయినా శక్తులను ఉంచడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా యోగ సాధనలో ఉన్న వారికి శరీరాన్ని నిలువుగా ఉంచడం లేదా మరో మాటలో చెప్పాలంటే ఈ రాత్రి నిద్రపోకుండా ఉండటం చాలా అవసరమన్నారు జగ్గీ వాసుదేవన్(Jaggi Vasudev).
ఈ పర్వదినాన్ని శివుని వివాహ వార్షికోత్సవంగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా ప్రతిష్టాత్మకంగా చూస్తారన్నారు సద్గురు. యోగ సంప్రదాయంలో శివుడిని దేవుడిగా పరిగణించరన్నారు. కానీ మొదటి గురువుగా లేదా ఆది గురువుగా భావిస్తారని, శివుడిని కొలుస్తారని చెప్పారు జగ్గీ వాసుదేవన్.(Jaggi Vasudev).
శివ అనే పదానికి కానిది అని అర్థం. మిమ్మల్ని మీరు కాదనే స్థితిలో మిమ్మల్ని మీరు ఉంచుకుని శివుడిని అనుమతించ గలిగితే జీవితంలో కొత్త దృష్టిని కలిగి ఉంటారని చెప్పారు సద్గురు.
Also Read : శివ నామ స్మరణం ఈషామయం