Adani LIC SBI Row : ఎల్ఐసీ..ఎస్బీఐని ఆదేశించింది ఎవరు
అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పిందెవరు
Adani LIC SBI Row : అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ వివాదం ఇంకా చల్లారలేదు. గత కొంత కాలం నుంచీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే గౌతం అదానీ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే దానిపై ప్రశ్నిస్తున్నారు. లోక్ సభలో మాట్లాడిన ప్రతిసారి అదానీ వ్యవహారంపై నిలదీశారు. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ చేస్తున్న మోసాలను బయట పెట్టింది.
కంపెనీకి సంబంధించి తప్పుడు లెక్కలు ఉన్నాయని, లేని విలువను పెంచేలా చేశారంటూ ఆరోపించింది . దీంతో ఒక్కసారిగా అదానీ షేర్లు కుప్ప కూలాయి. ప్రపంచ బిలియనీర్లలో టాప్ 5 లో ఉన్న గౌతం అదానీ ఉన్నట్టుండి 22వ స్థానానికి దిగజారాడు. దీనిపై పార్లమెంట్ లో పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కోరింది.
ఇప్పటికే సుప్రీంకోర్టు అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రాన్ని ఏకి పారేసింది. ప్యానెల్ కమిటీని నియమించాలని ఆదేశించింది. సీల్డ్ కవర్ లో పేర్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని కాదంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించింది. ఎవరి ఒత్తిళ్ల మేరకు ఎల్ఐసీ, ఎస్బీఐలో రూ.22,000 కోట్లు పెట్టుబడి పెట్టారంటూ నిలదీసింది(Adani LIC SBI Row).
అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్పీఓలో మార్కెట్ ధర దిగువకు పడి పోయినప్పటికీ ఎల్ఐసీ, ఎస్బీఐ ఎలా ఇన్వెస్ట్ చేశాయంటూ నిలదీసింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు