Isha Mahashivratri : ఆధునిక కాలానికి ఆది యోగి

స‌ద్గురుపై ద్రౌప‌ది ముర్ము కితాబు

Isha Mahashivratri  : ఆధునిక కాలంలో స‌ద్గురు ఆది యోగి అని అభివ‌ర్ణించారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.ఆయ‌న‌ను రిషి ఆఫ్ మోడ్రన్ టైమ్స్ అని కొనియాడారు. స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ సార‌థ్యంలో త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు ఈషా(Isha Mahashivratri 2023) ఫౌండేష‌న్ లో ఘ‌నంగా జ‌రిగింది మ‌హా శివ‌రాత్రి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

గ‌వ‌ర్న‌ర్ ఆర్ ఎన్ ర‌వి, బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామ‌లై పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి తంగ‌రాజ్ టి హాజ‌ర‌య్యారు. మ‌హా సాంస్కృతిక మ‌హోత్స‌వం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో సాగింది. వేలాది మంది భ‌క్తులు ఈషా ఫౌండేష‌న్ కు హాజ‌ర‌య్యారు. శివోం నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగింది ఆ ప్రాంతమంతా.

ఈషా ప్రాంగ‌ణాన్ని ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగించారు. ఇవాళ సంతోషంగా ఉంది. అంత‌కంటే ఆనందంగా ఉందన్నారు. ఆదియోగి స‌మ‌క్షంలో ఆది గురువును ద‌ర్శించు కోవ‌డం మ‌రింత ఆధ్యాత్మిక‌త‌ను క‌లుగ చేస్తోంద‌ని చెప్పారు. అంత‌కు ముందు ముక్తికి ద్వారం వ‌లె ప‌విత్రమైన‌, శ‌క్తివంత‌మైన అద్వితీయ‌మైన ధ్యాన లింగం వ‌ద్ద సద్గురు పంచ భూత క్రియ‌ను చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము, గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి పాల్గొన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా యోగా వ్యాప్తికి ప్ర‌తీక‌గా మ‌హా యాగ య‌జ్ఞాన్ని వెలిగించారు.

ఉన్న‌త‌మైన జీవిత ఆద‌ర్శాల కోసం వెతుకుతున్న వారికి ఈ ప‌ర్వ‌దినం ముఖ్యమైన‌ద‌ని పేర్కొన్నారు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్. ఆధునిక కాలంలో స‌ద్గురు రుషిగా అభివ‌ర్ణించారు రాష్ట్ర‌ప‌తి. అసంఖ్యాక‌మైన ప్ర‌జ‌లు ఆధ్యాత్మిక ప్ర‌గ‌తిని సాధించేందుకు ఆయ‌న నుంచి ప్రేర‌ణ పొందార‌ని అన్నారు.

Also Read : చైత‌న్యానికి ప్ర‌తీక శివ‌రాత్రి – స‌ద్గురు

Leave A Reply

Your Email Id will not be published!