Milind Lakkad TCS HR : తీసుకుంటాం కానీ తొలగించం – టీసీఎస్
అలాంటిది ఏమీ లేదన్న సీహెచ్ఆర్ లక్కడ్
Milind Lakkad TCS HR : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం దెబ్బకు దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్ , గూగుల్, మెటా ఫేస్ బుక్ , ఫిలిప్స్ , అమెజాన్ , మైక్రో సాఫ్ట్ ,తదితర ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ కంపెనీలు వేలాది మందిని ఇంటికి పంపించాయి. తాజాగా దేశంలో పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థగా ఇది పని చేస్తోంది. దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల ఎగుమతిదారుగా ఉంది సదరు కంపెనీ. టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్(Milind Lakkad TCS HR) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగాలు కోల్పోయిన స్టార్టప్ జాబర్స్ ను కూడా నియమించు కోవాలని తాము చూస్తున్నట్లు స్పష్టం చేశారు. యుఎస్ లో ప్రవాస భారతీయులను నియమించుకునేందుకు తమ కంపెనీ సిద్దంగా ఉందని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీసీఎస్ మిగతా కంపెనీల లాగా కాదు. ఒక్కసారి ఉద్యోగిని నియమించుకున్న తర్వాత వారంతా తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తామన్నారు లక్కడ్(Milind Lakkad TCS HR). ఎక్కువ కాలం వారి సేవలను వాడుకుంటాం.
అవసరమైన మరకు తర్ఫీదు కూడా ఇస్తామని చెప్పారు. కెరీర్ లో ప్రతిభను పెంచు కోవాలనే నమ్మకంతో ఎటువంటి తొలగింపులను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు . చాలా కంపెనీలు తాము కోరుకున్న దానికంటే ఎక్కువ మందిని నియమించుకున్నాయి. వారు తీసి వేస్తున్నారు. కానీ మేం అలా ఎప్పటికీ చేయం. అవసరమైనంత మేరకే తీసుకుంటాం. ఆ తర్వాత తొలగించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ .
Also Read : తమిళనాడులో ఓలా ప్లాంట్