INDW vs IREW ICC T20 : మెరిసిన మంధాన సెమీస్ కు భారత్
ఐర్లాండ్ పై అద్భుత విజయం నమోదు
INDW vs IREW ICC T20 : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టు అద్భుతం చేసింది. ముంబై స్టార్ హిట్టర్ స్మృతీ మంధాన కీలకమైన మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది. మారథాన్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో టీమిండియా వరల్డ్ కప్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. కనీసం సెమీస్ కైనా చేరుతుందా అన్న అనుమానాన్ని పటాపంచలు చేసింది భారత జట్టు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో పట్టుదలతో ఆడింది. అమ్మాయిలు తమకు ఎదురే లేదని నిరూపించారు.
లీగ్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన చివరి మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా మారింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది మంధాన. ఇప్పటికే ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఈ కీలక పోరులో మంధాన ఏకంగా 87 రన్స్ చేసింది. 5 పరుగుల తేడాతో ఓడించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ రూల్ ప్రకారం టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు.
మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది భారత్(INDW vs IREW ICC T20) . నిర్ణీత 20 ఓవర్లలో 156 రన్స్ చేసింది. స్మృతీ మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. 56 బంతులు ఎదుర్కొన్న మంధాన 9 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టింది. 87 రన్స్ చేసింది. కీలక పాత్ర పోషించింది.
గ్రూప్ బిలో ఇంగ్లండ్ తర్వాత టీమిండియా 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి వికెట్ కు మంధాన షెఫాలీతో కలిసి 62 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ గెలుపుతో అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు.
Also Read : స్మృతీ మంధాన మారథాన్ ఇన్నింగ్స్