ABVP Attacks : పెరియార్..కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం
నిప్పులు చెరిగిన తమిళనాడు సీఎం స్టాలిన్
ABVP Attacks : జవహర్ లాల్ యూనివర్శిటీ మరోసారి వివాదానికి దారి తీసింది. పెరియార్, కార్ల్ మార్క్స్ ఫోటోలు ధ్వంసం చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తీవ్రంగా ఖండించారు. క్యాంపస్ లో మత సామరస్యానికి భంగం కలిగించేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందని జేఎన్యూ ఎస్ యూ చీఫ్ ఐషే ఘోష్ ఆరోపించారు. తమిళ విద్యార్థులపై ఏబీవీపీ సభ్యులు చేసిన దాడిని తీవ్రంగా మండిపడ్డారు ఎంకే స్టాలిన్.
ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల బారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ సభ్యులు(ABVP Attacks) పెరియార్ , భగత్ సింగ్ , బాబా సాహెబ్ అంబేద్కర్ , కార్ల్ మార్క్స్ , జ్యోతి బా పూలే, సావిత్రి బాయి పూలే , తదితరుల చిత్రాలను ధ్వంసం చేశారంటూ వామపక్షాల నేతృత్వంలోని జేఎన్ యూ సంఘం ఆరోపించింది. యూనివర్శిటీ క్యాంపస్ లో ఇన్ స్టాల్ చేయబడిన ఇతర చిహ్నాలు కూడా తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎస్ యు కార్యాలయం లోపల గోడలను కూడా ఏబీవీపీ ధ్వంసం చేసిందంటూ ఆరోపించింది. క్యాంపస్ లో మత సామరస్యానికి భంగం కలిగించేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోందంటూ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు.
చిత్రాల తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా పెరియార్ , కార్ల్ మార్క్స్ , తదితరుల చిత్రాలు తొలగించడాన్ని సీరియస్ గా తీసుకున్నారు స్టాలిన్. తమిళనాడు విద్యార్థులను రక్షించాలని వైఎస్ ఛాన్సలర్ ను కోరారు సీఎం . మంగళవారం ట్వీట్ చేశారు స్టాలిన్.
Also Read : శృంగేరి పీఠంలో జేపీ నడ్డా