Manish Sisodia CBI Case : స్నూపింగ్ కేసులో సిసోడియాపై విచార‌ణ

సీబీఐకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కేంద్ర స‌ర్కార్

Manish Sisodia CBI Case : ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా కు కోలుకోలేని షాక్ త‌గిలింది. స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం.

2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఫీడ్ బ్యాక్ యూనిట్ మంత్రిత్వ శాఖ‌లు, ప్ర‌తిప‌క్ష పార్టీలు, సంస్థ‌లు, వ్య‌క్తుల‌పై గూఢ‌చ‌ర్యం కోసం ఉప‌యోగించ బ‌డింద‌ని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే మ‌నీష్ సిసోడియా ఢిల్లీ ప్ర‌భుత్వ విజిలెన్స్ విభాగానికి కూడా నేతృత్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై క‌న్నేసిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియాపై(Manish Sisodia CBI Case) ద‌ర్యాప్తు ప్రారంభించేందుకు కేంద్ర హోం శాఖ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అనుమ‌తి ఇచ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో కేంద్ర ఏజెన్సీ ఇప్ప‌టికే ఆప్ నేత‌ను విచారిస్తోంది. ఈ ఆదివారం త‌మ ముందు విచార‌ణ‌కు రావాల్సిందిగా స‌మ‌న్లు జారీ చేసింది.

ఈ మేర‌కు నోటీసులు కూడా అంద‌జేసింది. ఢిల్లీ స‌ర్కార్ కు సంబంధించిన కొత్త బ‌డ్జెట్ ను రూపొందించే ప‌నిలో ఉన్నాన‌ని అందుకే త‌న‌కు స‌మ‌యం కావాల‌ని కోరారు. దీంతో సీబీఐ కూడా ఓకే చెప్పింది. ఈ ఆదివారం విచార‌ణ‌కు రావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. సీబీఐ త‌న‌ను అరెస్ట్ చేయాల‌ని అనుకుంటోంద‌ని కానీ తాను భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా.

Also Read : ‘రౌత్’ ప్రాణాల‌కు ముప్పేమీ లేదు

Leave A Reply

Your Email Id will not be published!