Nitish Kumar Anger : ఇది బీహార్ ఇంగ్లండ్ కాదు – నితీశ్

నిప్పులు చెరిగిన బీహార్ సీఎం

Nitish Kumar Anger : బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఎవ‌రినో కాదు ఓ రైతు మీద‌. ఆయ‌న కోపానికి గ‌ల కార‌ణం ఓ రైతు ఇంగ్లీష్ లో మాట్లాడ‌టమే. దీనిపై తీవ్రంగా మండిప‌డ్డారు. స్మార్ట్ ఫోన్ వ్య‌స‌నం వ‌ల్ల ప్ర‌జ‌లు త‌మ సొంత భాష‌ల‌ను పూర్తిగా మ‌రిచి పోయారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar Anger). త‌న ఉత్తేజ క‌ర‌మైన జీవిత ప్ర‌యాణాన్ని విరించారు ఓ రైతు.

దీనిపై సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నాల్గ‌వ వ్య‌వ‌సాయ రోడ్ మ్యాప్ ప్రారంభోత్స‌వానికి గుర్తుగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో బాపు స‌భాన‌గ‌ర్ ఆడిటోరియంలో స్పీక‌ర్ త‌న‌ను తాను ల‌ఖిస‌రాయ్ కు చెందిన అమిత్ కుమార్ గా గుర్తించారు.

పూణేలో మంచి కెరీర్ తో మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అయిన ఆయ‌న అన్నింటినీ వ‌దులుకుని త‌న సొంత జిల్లాలో పుట్ట‌గొడుగుల పెంప‌కం చేప‌ట్టేందుకు ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకునే వాతావ‌ర‌ణాన్ని సృష్టించినందుకు రైతు అమిత్ కుమార్ సీఎం నితీశ్ కుమార్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

త‌న ప్ర‌సంగం ప్రారంభ‌మైన కొద్ది నిమిషాల‌కే వ్య‌వ‌సాయ వ్య‌వ‌స్థాప‌కుడిని సీఎం ఆపారు. నితీశ్ త‌న సీటులోనే ఉండి హ్యాండ్ హోల్డ్ మైక్రో ఫోన్ ను ఉప‌యోగించి అడ్డ‌గించడం క‌ల‌క‌లం రేపింది. అన్ని ఆంగ్ల ప‌దాల‌ను ఉప‌యోగించడంలోని అసమంజస‌త‌ను నేను మీకు ఎత్తి చూపాల‌ని అనుకుంటున్నా. ఇది ఇంగ్లాండ్ నా మీరు బీహార్ లో ప‌ని చేస్తున్నార‌ని గుర్తు చేశారు సీఎం(Nitish Kumar Anger).

Also Read : త‌ప్పైంది మేడం మన్నించండి

Leave A Reply

Your Email Id will not be published!