Mallikarjun Kharge Congress-Led : ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ సారథ్యం
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
Mallikarjun Kharge Congress-Led : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన ప్రకటన చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు. దేశంలో ఏర్పడే ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం(Mallikarjun Kharge Congress-Led) వహిస్తుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్రషా , జేపీ నడ్డా కలిసి యజ్ఞం చేసినా , యాగాలు నిర్వహించినా గెలిచే ప్రసక్తి లేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఈశాన్య ప్రాంతంలో పార్టీ, దాని మిత్రపక్షాలపై గట్టి పోరాటానికి పార్టీ సిద్దమవుతున్న తరుణంలో బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ తీవ్ర స్థాయిలో దాడి చేశారు. నాగా లాండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో బుధవారం మల్లికార్జున్ ఖర్గే పాల్గొని ప్రసంగించారు. 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇతర పార్టీలతోనూ చర్చలు జరుపుతోందని ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ అనేకసార్లు దేశాన్ని ఎదుర్కోగల ఏకైక వ్యక్తిని నేను.
ఇతర వ్యక్తులు ఎవరూ నన్ను తాకలేరని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మోదీ లాంటి నేతలు ఈ దేశంలో కొలువు తీరాని , ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో శూన్యమని మండిపడ్డారు. పీఎం ప్రజాస్వామ్యంలో ఉన్నారని మరిచి పోయారని, తాను నియంత అని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్లికార్జున్ ఖర్గే. త్వరలోనే ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటమిదే రాబోయే కాలమని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే.
Also Read : రౌత్’ ప్రాణాలకు ముప్పేమీ లేదు