Shelly Oberoi Mayor : నిన్న మాజీ ప్రొఫెస‌ర్ నేడు ఢిల్లీ మేయ‌ర్

ఎవ‌రీ షెల్లీ ఒబెరాయ్ ఏమిటా క‌థ

Shelly Oberoi Mayor : దేశ రాజ‌ధాని ఢిల్లీలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ మ‌హా న‌గ‌ర కార్పొరేష‌న్ (ఎంసీడీ) ఎన్నిక‌లు ముగిసినా మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ , స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎంపిక జ‌ర‌గ‌లేదు. అధికారంలో ఉన్న ఆప్ కు, కేంద్రంలో ఉన్న బీజేపీకి మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగింది.

సంఖ్యా ప‌రంగా ఆధిక్యంలో ఉన్నా ఆప్ తీవ్ర ఇబ్బ‌దులు ఎదుర్కొంది. చివ‌ర‌కు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో మూడుసార్లు వాయిదా ప‌డిన ఎంసీడీ మేయ‌ర్ ఎన్నిక‌లు బుధ‌వారం ముగిశాయి. 34 ఓట్ల తేడాతో మేయ‌ర్ గా ఆప్ కు చెందిన షెల్లీ ఒబేరాయ్ ఎన్నిక‌య్యారు. ఇంత‌కీ ఆమె ఎవ‌రు అనేది చ‌ర్చ‌కు దారితీసింది.

ఆప్ లో కీల‌క‌మైన నాయ‌కురాలుగా గుర్తింపు పొందారు. ఆమె పీహెచ్ డీ చేశారు. ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌దువుకున్నారు. న‌ర్సీమోంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్ట‌డీస్ , ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్శిటీ ల‌లో మాజీ ప్రొఫెస‌ర్ గా కూడా ప‌ని చేశారు. ఒబెరాయ్ ఢిల్లీలోని ఈస్ట్ ప‌టేల్ న‌గ‌ర్ నుండి మొద‌టిసారి కౌన్సిల‌ర్ గా ఎన్నిక‌య్యారు.

ఆమె వార్డు నంబ‌ర్ 86 నుండి ఎన్నిక‌య్యారు. 39 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన షెల్లీ ఒబెరాయ్(Shelly Oberoi Mayor) గ‌ణ‌నీయ‌మైన తేడాతో ఓడించారు ప్ర‌త్య‌ర్థిని. డాక్ట‌ర్ ఒబెరాయ్ ఇండియ‌న్ కామ‌ర్స్ అసోసియేష‌న్ లో జీవిత కాలం స‌భ్యురాలిగా ఉన్నారు. ఇగ్నో నుండి స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుడి పీహెచ్ డీ ప‌ట్టా పొందారు. ఆమె ఆ రంగంలో అనేక ప్ర‌శంస‌లు పొందారు. ప్ర‌స్తుతం మేయ‌ర్ గా త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌ర్చ‌నున్నారు.

Also Read : గూండాలు ఓడి పోయారు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!