Joyalukkas ED Seized : రూ.305 కోట్ల జోయాలుకాస్ ఆస్తులు సీజ్
ప్రకటించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ
Joyalukkas ED Seized : ప్రముఖ ఆభరణాల సంస్థ జోయా లుకాస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఏకంగా రూ. 305 కోట్ల విలువైన ఆభరణాలు, ఆస్తులను జప్తు(Joyalukkas ED Seized) చేసినట్లు వెల్లడించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ రూల్స్ ను ఉల్లంఘించిందంటూ ఈడీ ఆరోపించింది. అటాచ్ చేసిన ఆస్తులలో రూ. 81.54 కోట్ల విలువైన 33 స్థిరాస్థులు ఉన్నాయి.
దేశంలోని ఆభరణాల సంస్థలలో జోయా లుకాస్ ఒకటిగా గుర్తింపు పొందింది. జోయాలుకాస్ కు చెందిన 5 రోజుల తర్వాత దర్యాప్తు సంస్థ సోదాలు జరిపిన అనంతరం రూ. 305.84 కోట్ల విలువైన ఆస్తులను జప్తు(Joyalukkas ED Seized) చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టలోని రూల్స్ ను ఉల్లంఘించిందని ఈడీ మండిపడింది. ఈ కేసు లో హవాలా మార్గాల ద్వారా భారతదేశం నుండి దుబాయ్ కి భారీ మొత్తంలో నగగదును బదిలీ చేసిందని పేర్కొంది.
ఆ తర్వాత 100 శాతం జోయా లుకాస్ వర్గీస్ కు చెందిన జోయాలుకాస్ జ్యువెలరీ ఎల్ఎల్సీ దుబాయ్ లో పెట్టుబడి పెట్టింది. ఇదిలా ఉండగా కంపెనీ తన 2,300 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీఎంని ఉపసంహరించుకుంది. దాని ఆర్థిక ఫలితాలకు గణనీయమైన మార్పులు చేసేందుకు మరింత సమయం కావాలని కోరింది.
ఇక అటాచ్ చేసిన ఆస్తులలో రూ. 81.54 కోట్ల విలువ చేసే 33 స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో త్రిస్సూర్ లోని శోభా సిటీలో భూమి , నివాస భవనం ఉన్నాయి. 91.22 లక్షల విలువైన మూడు బ్యాంకు ఖాతాలు , రూ. 5.58 కోట్ల విలువైన మూడు ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ. 217.81 కోట్ల విలువైన జోయా లుకాస్ షేర్లను కూడా ఈడీ సీజ్ చేసింది.
Also Read : రూపకు షాక్ సింధూరికి ఊరట