Sanju Samson : శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా
బీసీసీఐ కక్ష సాధింపు చర్య
Sanju Samson Selection : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కంటిన్యూగా విఫలం అవుతూ వస్తున్న కేఎల్ రాహుల్ ను కంటిన్యూగా ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ నిలదీశారు.
ఇదే సమయంలో అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ వస్తున్నా తుది జట్టులో ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ దేశమైనా లేదా ఏ క్రీడా సంస్థ అయినా ఆటలో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేయడం సర్వ సాధారణం.
కానీ బీసీసీఐ వరకు వచ్చేసరికల్లా సీన్ వేరుగా ఉంది. అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా బీసీసీఐకి పేరుంది. కానీ ఎక్కడా లేని పాలిటిక్స్ బీసీసీఐలో చోటు చేసుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రమైన ఆరోపణలు వున్నాయి. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లు పట్టించు కోవడం లేదు సంజూ శాంసన్ ను(Sanju Samson Selection).
కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మాత్రమే సంజూ శాంసన్(Sanju Samson) పరిమితం అయ్యేలా ఉన్నాడని , ప్రతిభ కలిగి ఉన్న ఆటగాడి పట్ల బీసీసీఐ ఇంత కక్ష సాధింపు ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు శశి థరూర్. ఎంపీ చేసిన కామెంట్స్ కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. బీసీసీఐ శాంసన్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతున్నారు.
Also Read : ఐసీసీ షార్ట్ లిస్టులో రిచా ఘోష్