KL Rahul : మూడో టెస్టులో కేఎల్ రాహుల్ క‌ష్ట‌మే

పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై ఆందోళ‌న

KL Rahul  3rd Test : టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న 4 టెస్టుల సీరీస్ లో ఇప్ప‌టికే నాగ్ పూర్ , ఢిల్లీ లలో జ‌రిగిన టెస్టుల్లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. కానీ ప్ర‌ధాన బ్యాట‌ర్ల ప‌ర్ ఫార్మెన్స్ పై నీలి నీడలు క‌మ్ముకున్నాయి. ప్ర‌ధానంగా జ‌ట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్(KL Rahul  3rd Test) ఇప్పుడు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇటీవ‌లి కాలంలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడింది చాలా త‌క్కువ‌. ఇక మార్చి 1 నుంచి మూడో టెస్టు ఆడేందుకు రెడీ అవుతోంది భార‌త జ‌ట్టు.

కేఎల్ రాహుల్ ను కంటిన్యూగా ఎంపిక చేస్తూ ఉండ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. సీరీస్ లో 2-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇక కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయ‌క పోవ‌చ్చ‌ని స‌మాచారం. కేఎల్ రాహుల్ కు బ‌దులు ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. మూడో టెస్టు ప్ర‌స్తుతం ఇండోర్ వేదిక‌గా జ‌ర‌నుంది. పేల‌వ‌మైన ఫామ్ కార‌ణంగా త‌ప్పించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని భావిస్తోంది బీసీసీఐ.

ఇక తొలి, రెండో టెస్టులు క‌లిపి కేఎల్ రాహుల్ మూడు ఇన్నింగ్స్ లు ఆడి కేవ‌లం 35 ప‌రుగులు చేశాడు. గ‌తంలో వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ స‌రిగా రాక పోవ‌డంతో ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్ర‌విడ్ పూర్తిగా కేఎల్ రాహుల్ కు(KL Rahul) సపోర్ట్ గా ఉండ‌డంతో తొల‌గిస్తారా లేక కంటిన్యూ చేస్తారా అన్న‌ది చూడాలి. ఒక‌వేళ తొల‌గిస్తే అత‌డి స్థానంలో శుభ్ మ‌న్ గిల్ , సూర్య కుమార్ యాద‌వ్ ను ఎంపిక చేయ‌నున్నారు.

Also Read : ద్ర‌విడ్ ను విమ‌ర్శించ‌ని గ‌వాస్క‌ర్

Leave A Reply

Your Email Id will not be published!