YS Sharmila : గాడి తప్పిన కేసీఆర్ పాలన
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
YS Sharmila TS : వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆర్థిక పరిస్థితి దివాళా తీసేలా ఉందని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిశారు. వినతిపత్రం సమర్పించారు. తాను అన్నింటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తానని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు వైఎస్ షర్మిల.
గత ఎనిమిదేళ్లుగా హామీలు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కానీ ఇప్పటి వరకు ఒక్కడి కూడా భర్తీ చేయలేదన్నారు. నోటిఫికేషన్లు వేస్తున్నారే తప్పా ఒక్కరికి కూడా నియామక పత్రం ఇవ్వలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila TS). తెలంగాణ పేరుతో దోచుకోవడం, దాచు కోవడం చేశారని అభివృద్ది గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పోలీసులను పనివాళ్లుగా మార్చుకుని రక్తపాతం సృష్టిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈసారి ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. అందుకే రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో విధించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
డిస్కంలు దివాళా తీశాయని , ఆర్టీసీని ఆగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోందన్నారు. నియంత పాలనను ఫామ్ హౌస్ వరకే పరిమితం చేయాలని సూచించారు.
Also Read : కాంగ్రెస్ సభ్యులకు కొత్త మార్గదర్శకాలు