AUSW vs SAW ICC T20 Final : విశ్వ విజేత నువ్వా నేనా

ఆస్ట్రేలియా వ‌ర్సెస్ సౌతాఫ్రికా

AUSW vs SAW ICC T20 Final : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌హిళా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నెల రోజుల పాటు సాగిన ఈ మెగా టోర్నీలో ఊహించ‌ని రీతిలో సౌతాఫ్రికా ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది. రిచ్ లీగ్ లో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి. చివ‌ర‌కు నాలుగు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైన‌ల్ లో భార‌త్ , ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది.

చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగింది. చివ‌ర‌కు 5 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. ఆస్ట్రేలియా నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది. గ‌త ఏడాది కూడా ఐసీసీ మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను చేజిక్కించుకుంది.

ఇంక రెండో సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ , సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ పోటీ కూడా తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది. 6 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది ఇంగ్లండ్. ఇక ఆతిథ్య జ‌ట్టుకు హోం అడ్వాంటేజ్ ఉండ‌డంతో ఇవాళ జ‌రిగే ఫైన‌ల్(AUSW vs SAW ICC T20 Final) పోరు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.

జ‌ట్ల ప‌రంగా చూస్తే ఆస్ట్రేలియా హాట్ ఫెవ‌రేట్ గా ఉంది. ఆ జ‌ట్టు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఇక దక్షిణాఫ్రికా ప‌డుతూ లేస్తూ వ‌చ్చింది. కానీ ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టింది. దీంతో ఆస్ట్రేలియా మ‌రోసారి క‌ప్పు గెలుస్తుందా లేక సౌతాఫ్రికా స‌త్తా చాటుతుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : సానియా మీర్జా కోచ్ గా రాణిస్తుందా

Leave A Reply

Your Email Id will not be published!