Nikki Haley : అమెరికా శ‌త్రువుల‌ను క్ష‌మించదు – నిక్కీ

పాకిస్తాన్ కు చేసే సహాయంలో కోత త‌ప్ప‌దు

Nikki Haley USA : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉన్నానంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి దారి తీసింది ప్ర‌వాస భార‌తీయురాలైన నిక్కీ హీలీ. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా విదేశాంగ విధానం, ఆర్థిక సాయం, వీసాల మంజూరు, ఉపాధి క‌ల్ప‌న‌, ఆయుధాల అంద‌జేత‌పై సీరియ‌స్ గా స్పందించారు. ప్ర‌త్యేకించి బ‌ల‌మైన అమెరికా శ‌త్రువుల‌ను క్ష‌మించ‌ద‌ని హెచ్చ‌రించారు నిక్కీ హీలీ(Nikki Haley USA) . గ‌ర్వించే అమెరికా మ‌న ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును వృధా చేయ‌ద‌న్నారు.

శ‌త్రువుల‌కు పంపే ప్ర‌తి సెంటును త‌గ్గిస్తామ‌న్నారు నిక్కీ హీలీ. యుఎస్ రిప‌బ్లిక‌న్ పార్టీ అధ్య‌క్ష అభ్యర్థి నిక్కీ హేలీ అధికారంలో గ‌నుక వ‌స్తే అమెరికాను ద్వేషించే దేశాల‌కు విదేశీ సాయంలో ప్ర‌తి శాతం కోత పెడ‌తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఉంద‌న్నారు. మ‌న‌ల్ని ద్వేషించే దేశాల‌కు ఎందుకు సహాయం చేయాలని ప్ర‌శ్నించారు. మ‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌ని వారికే సాయం అందుతుంద‌న్నారు నిక్కీ హేలీ(Nikki Haley).

ఇదిలా ఉండ‌గా సౌత్ క‌రోలినా మాజీ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు. అంతే కాకుండా ఐక్య రాజ్య స‌మితిలో మాజీ యుఎస్ రాయ‌బారిగా కూడా ఉన్నారు. ఆమె ప్ర‌ధానంగా విదేశీ సాయం గురించి ప్ర‌స్తావించారు. గ‌త ఏడాది అమెరికా విదేశీ సాయం కోసం $46 బిలియ‌న్లు ఖ‌ర్చు చేసింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర దేశాల కంటే ఎక్కువ అని తెలిపింది. నిక్కీ హేలీ ఫిబ్ర‌వ‌రి 15 నుంచి త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది.

Also Read : చైనా అభ్యంత‌రం ప్ర‌క‌ట‌న విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!