No G20 Statement : చైనా అభ్యంత‌రం ప్ర‌క‌ట‌న విఫ‌లం

జి20 ఆర్థిక స‌ద‌స్సులో కొలిక్కిరాని చ‌ర్చ‌లు

No G20 Statement : క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో జి20 ఆర్థిక మంత్రుల స‌మావేశం జ‌రిగింది. ఇందులో ప్ర‌ధానంగా ఉక్రెయిన్ యుద్దం ప్రస్తావ‌న‌కు వ‌చ్చింది. ఉక్రెయిన్ వార్ కు సంబంధించిన సూచ‌న‌ల‌ను నీరు గార్చేందుకు చైనా ప్ర‌య‌త్నించ‌డంతో భార‌త్ లో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌ను జారీ చేయ‌డంలో ఆర్థిక మంత్రులు విఫ‌ల‌మ‌య్యారు. ఇది కీల‌క‌మైన అడ్డంకిగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.

అయితే జీ20 స‌ద‌స్సులో(No G20 Statement) పాల్గొన్న వారిలో అత్య‌ధిక శాతం యుద్దాన్ని ఖండించారు. ఈ స‌ద‌స్సులో చోటు చేసుకున్న ప‌రిస్థితి, ఆంక్ష‌ల‌పై భిన్న‌మైన అంచ‌నాలు ఉన్నాయి. ర‌ష్యా, చైనా మిన‌హా అన్ని దేశాలు అంగీక‌రించాయ‌ని విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

స్పెయిన్ ప్ర‌తినిధి నాడియా కాల్వినో మాట్లాడారు. ప్ర‌పంచం లోని అగ్ర‌శ్రేణి 20 ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య చ‌ర్చ‌ల‌లో కొన్ని పేర్కొన‌బ‌డ‌ని దేశాలు తక్కువ నిర్మాణాత్మ‌క విధానాల కార‌ణంగా ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ష్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు. చైనా గ‌త న‌వంబ‌ర్ నుండి ప్ర‌క‌ట‌న భాష‌ను మార్చాల‌ని కోరింది. బీజింగ్ యుద్దం అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

జి20 దేశాల‌కు చెందిన ఆర్థిక మంత్రులు, సెంట్ర‌ల్ బ్యాంక్ ల చీఫ్ లు గ‌తంలో కూడా స‌మావేశం అయ్యారు. కానీ ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. ర‌ష్యా గ‌త ఫిబ్ర‌వ‌రి లో పొరుగు దేశంపై దాడికి దిగింది. కానీ ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. అమెరికా, యూరోపియ‌న్ దేశాలు ఎగ‌దోస్తున్నాయ‌ని లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read : క్రిప్టో క‌రెన్సీ ప‌ట్ల భార‌త్ వైఖ‌రి భేష్

Leave A Reply

Your Email Id will not be published!