ICC T20 World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ విజేత ఆసిస్
వరుసగా ఆరోసారి కప్పు కైవసం
ICC T20 Worldcup Winner 2023 : అంతా అనుకున్నట్టే జరిగింది. అన్ని ఫార్మట్ లలో అద్భుతంగా రాణిస్తూ వస్తున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు వరుసగా ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికా వేదికగా(ICC T20 Worldcup Winner 2023) జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్ విజేతగా అవతరించింది. సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ ను మట్టి కరిపించి ఫైనల్ కు చేరిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మ్యాజిక్ చేస్తుందని ఆసిస్ కు చుక్కలు చూపిస్తుందని అంతా భావించారు.
కానీ ఆస్ట్రేలియా ముందు వారి పప్పులు ఉడకలేదు. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ ను సృష్టించింది.
మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా లోని కేప్ టౌన్ న్యూలాండ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా సఫారీ టీమ్ ను 19 పరుగుల తేడాతో ఓడించింది జగజ్జేతగా నిలిచింది. ఆసిస్ ఓపెనర్ బెత్ మూనీ మరోసారి సత్తా చాటింది. తనకు ఎదురే లేదని అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. 79 పరుగులతో అజేయంగా నిలిచింది. కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. విచిత్రం ఏమిటంటే సఫారీ టీం ఓపెనర్ లారా వోల్వార్ట్ 61 రన్స్ చేసింది.
ఇక ఆసిస్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 రన్స్ చేసింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 రన్స్ మాత్రమే చేసింది. లోరా చివరి వరకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
Also Read : తుది జట్టు ఎంపికపై ఉత్కంఠ