KL Rahul Dropped : కేఎల్ రాహుల్ కష్టం గిల్ కు అవకాశం
ఆసిస్ తో జరిగే మూడో టెస్టులో మార్పు
KL Rahul Dropped : ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు కేఎల్ రాహుల్(KL Rahul Dropped) ఆడటం కష్టమే. ఇప్పటికే 10 ఇన్నింగ్స్ లలో ఆశించిన మేర ఆడలేక పోయాడు. 7 ఇన్నింగ్స్ లలో 95 పరుగులు చేశాడు. పూర్ పర్ ఫార్మెన్స్ తో ఇంకెంత కాలం రాహుల్ ను కంటిన్యూ చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జట్టులో ఉంటాడో ఉండోనన్న అనుమానం తలెత్తుతోంది. కానీ కెప్టెన్, కోచ్ మాత్రం రాహుల్ ను కంటిన్యూ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
అతడి స్థానంలో శుభ్ మన్ గిల్(Shubman Gill) లేదా ఉమేష్ యాదవ్ ను తీసుకుంటారని టాక్. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ నుండి తొలగించారు. ఆట పరంగా కూడా ఆశించిన స్థాయిలో లేడు. ఇక ఎంత కాలం భరిస్తారంటూ ఓ వైపు ఆరోపణలు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలవాలంటే ఈ టెస్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మొత్తం ఆడిన ఇన్నింగ్స్ లలో 30 పరుగుల మార్క్ ను దాట లేక పోయాడు. 47 టెస్టుల్లో అతడి కెరీర్ సగటు 33 శాతం కూడా లేదు. నెట్ సెషన్ లో శుభ్ మన్ గిల్ ఉన్నాడు.
ఇక భారత్ ఎలెవన్ పరంగా చూస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ , టాప్ , మిడిల్ ఆర్డర్ లో ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ , ఆల్ రౌండర్లు గా రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ , అక్షర్ పటేల్ ఉన్నారను. ఇక వికెట్ కీపర్ గా కేఎస్ భరత్ , పేసర్ల విషయానికి వస్తే షమీ, ఉమేష్ యాదవ్ , సిరాజ్ ఆడనున్నారు. చివరకు ఒకవేళ మార్పు చేస్తే కేఎల్ రాహుల్(KL Rahul) స్థానంలో గిల్ , సిరాజ్ స్థానంలో యాదవ్ ను తీసుకోనుంది.
Also Read : దాదా బౌలింగ్ కపూర్ సిక్సర్