PM Modi Technology : సాంకేతిక సాయం దేశం పురోగమనం
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi Technology : టెక్నాలజీ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సమయంలో అది లేకుండా మనం ఏమీ చేయలేం. 2047 నాటికి భారత దేశం అభివృద్ది చెందిన దేశంగా మారేందుకు సాంకేతికత సహాయం చేస్తుందన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Technology). మారుతున్న టెక్నాలజీ ఎందరికో ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. కొన్ని చోట్ల ఆర్థిక మంద గమనం పేరుతో తీసి వేసినా ఇంకొన్ని చోట్ల ఉపాధికి ఢోకా లేకుండా పోయిందన్నారు. కులం, మతం, ప్రాంతం అన్న భేదం లేకుండా సాంకేతికత రంగం సమాన అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు.
అదే దిశలో కేంద్ర సర్కార్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. 2023 కేంద్ర బడ్జెట్ లో సాంకేతికత , మానవ స్పర్శకు ప్రాధాన్యత ఇస్తూ అందరికీ భరోసా కల్పిస్తోందన్నారు ప్రధానమంత్రి. మంగళవారం బడ్జెట్ అనంతరం జరిగిన వెబ్ నార్ లో పాల్గొన్నారు.
న్యూఢిల్లీలో అన్ లీషింగ్ ది పొటెన్షియల్ ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2023లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆలోచనలు, సూచనలు కోరేందుకు ప్రభుత్వం నిర్వహించిన 12 పోస్ట్ బడ్జెట్ వెబ్ నార్ సీరీస్ లో ఇది వరుసగా ఐదోవది కావడం విశేషం. ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడంతో పాటు ప్రయోజనాలు అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వం నిర్దారిస్తోందన్నారు నరేంద్ర మోదీ(PM Modi).
ప్రభుత్వ ఇ మార్కెట్ ప్లేస్ పోర్టల్ తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించేందుకు సూదర ప్రాంతాల నుండి చిన్న దుకాణాదారులు లేదా వీధి వ్యాపారులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించిందన్నారు ప్రధానమంత్రి.
Also Read : స్వేచ్ఛా వాణిజ్యం ఓ గేమ్ ఛేంజర్