Google Star Performer : టాప్ లో ఉన్నా తొల‌గించిన గూగుల్

ఉద్యోగి విజ‌య వ‌ర్గియా ఆవేద‌న

Google Laid Off : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌ధానంగా ప్ర‌వాస భార‌తీయుడైన సుంద‌ర్ పిచాయ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఉన్నారు. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు , కాస్ట్ క‌టింగ్ బూచి చూపించి టెక్ దిగ్గ‌జ కంపెనీల‌న్నీ తొలగింపు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాయి. మొద‌ట ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ 9 వేల మందిని సాగ‌నంపాడు.

ఆ త‌ర్వాత గూగుల్ 12 వేల మందిని, మైక్రో సాఫ్ట్ 10 వేల మందిని, మెటా ఫేస్ మ‌రో 10 వేల మందిని, అమెజాన్ 18 వేల మందిని తొల‌గించాయి. తాజాగా గూగుల్ కు సంబంధించిన చాలా ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఎవ‌రైనా ప‌ర్ ఫార్మెన్స్ బాగా లేక పోతే కంపెనీలు తొల‌గిస్తాయ‌ని కానీ గూగుల్ లో తాను టాప్ ప‌ర్ ఫార్మ‌ర్ గా ఉన్నా కానీ చెప్ప‌కుండానే తొల‌గించింద‌ని(Google Laid Off) వాపోయారు ప్ర‌వాస భార‌తీయ టెక్కీ విజ‌య్ వ‌ర్గియా.

త‌న‌ను ఎందుకు తొల‌గించారో ఇప్ప‌టికీ తెలియ‌డం లేద‌న్నాడు. బాధ‌ను త‌ట్టుకోలేక లింక్డ్ ఇన్ లో త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు. గూగుల్ తొల‌గించిన 12,000 మంది కార్మికుల‌లో తాను ఒక‌రిన‌ని తెలుసుకున్న త‌ర్వాత తాను నోరు మెద‌ప లేద‌న్నారు. హైద‌రాబాద్ కు చెందిన టెక్కీ హ‌ర్ష్ విజ‌య వ‌ర్గియా.

నెల కోసం స్టార్ పెర్ ఫార్మ‌ర్ గా రివార్డు పొందాను. కానీ అనుకోకుండా నా పేరు కూడా ఉంది. న‌మ్మ‌లేక పోయా..కానీ లిస్టులో పేరు చూసి క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక పోయాన‌ని వాపోయారు. ప‌ని తీరు ఆధారంగా తొల‌గించ లేద‌ని ఉద్యోగులు ఆరోపించారు.

Also Read : సాంకేతిక సాయం దేశం పురోగ‌మ‌నం

Leave A Reply

Your Email Id will not be published!