Adani Row : అదానీ వివాదంపై సుప్రీం కీలక తీర్పు
ప్యానెల్ ఏర్పాటుపై కేంద్రానికి ఆదేశం
SC Judgement Adani Row : అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై గురువారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. మార్కెట్లను పర్యవేక్షించేందుకు ప్యానెల్ కోసం చేసిన అభ్యర్థనపై కీలక నిర్ణయం ప్రకటించనుంది.
స్టాక్ మార్కెట్ల కోసం ఇప్పటికే ఉన్న నియంత్రణ చర్యలను బలోపేతం చేసేందుకు డొమైన్ నిపుణుల ప్యానెల్ ను ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రకటించే అవకాశాం ఉంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మోసం ఆరోపణలతో ఇటీవలి అదానీ గ్రూప్ షేర్ల పతనానికి సంబంధించిన దావాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం(SC Judgement Adani Row) కీలక ప్రకటన చేయనుంది.
ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ , న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. తన ఆర్డర్ ను రిజర్వ్చేస్తూ ఫిబ్రవరి 17న అత్యున్నత న్యాయ స్థానం ప్రతిపాదిత నిపుణుల ప్యానెల్ పై కేంద్రం చేసిన సూచనను సీల్డ్ కవర్ లో అంగీకరించేందుకు నిరాకరించింది.
పెట్టుబడిదారుల రక్షణ కోసం పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు గమనించిన అత్యున్నత న్యాయ స్థానం ప్రతిపాదిత ప్యానెల్ పని తీరును ఏ సిట్టింగ్ జడ్జి పర్యవేక్షించే అవకాశాన్ని కూడా తోసిపుచ్చింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ష్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) వంటి చట్ట బద్దమైన సంస్థలు పూర్తిగా సన్నద్దమై పనిలో ఉన్నాయని(SC Judgement) నొక్కి చెప్పింది కేంద్రం. సీల్డ్ కవర్ లో తాము తీసుకోబోమంటూ స్పష్టం చేసింది ధర్మాసనం.
ఈ అంశంపై న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ , కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ , సామాజిక కార్యకర్త ముఖేష్ కుమార్ లు ఇప్పటి వరకు నాలుగు పిల్ లు దాఖలు చేశారు.
Also Read : సిసోడియా బీజేపీలో చేరితే కేసులుండవు