Italian PM Meloni : మోదీ ప్రియమైన నాయకుడు – మెలోనీ
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా ప్రశంస
Italian PM Meloni : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ. జి20లో భాగంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా జార్జియా మోలోనికి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
ఇరు దేశాల ప్రధానమంత్రులు చర్చలు జరిపారు. కొన్ని అంశాలకు సంబంధించి సంతకాలు కూడా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు జార్జియా మెలోనీ. ప్రపంచ నాయకులందరిలో ప్రధానమంత్రి మోదీ మోస్ట్ పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. రక్షణ, ఆర్థిక రంగాలలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని తెలిపారు జార్జియా మెలోనీ(Italian PM Meloni) . ఆమెతో పాటు ఇటలీ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనియో తజానీ , ఉన్నత స్థాయి వ్యాపార ప్రతినిధి బృందం కూడా ఆమె ఉంట ఉన్నారు.
భారత్ జి20 ప్రెసిడెన్సీకి ఇటలీ పూర్తి మద్దతుపై ప్రధానమంత్రి ఆధార పడవచ్చని జార్జియా మెలోనీ స్పష్టం చేశారు. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రియమైన నాయకుడు అంటూ కితాబు ఇచ్చారు. గత ఏడాది నవంబర్ లో ఇండనేషియాలోని బాలిలో జరిగిన జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెలోనీతో(Italian PM Meloni) జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.
Also Read : తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి