Sunil Gavaskar : భారత్ పరాజయం గవాస్కర్ ఆగ్రహం
బ్యాటర్ల నిర్లక్ష్యమే కొంప ముంచింది
Sunil Gavaskar Slams India Team : ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడి పోయింది. పరాజయం అనంతరం సీరియస్ కామెంట్స్ చేశారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్. పూర్తిగా భారత బ్యాటర్ల నిర్లక్ష్యం, వైఫల్యమే కొంప ముంచిందని మండిపడ్డారు. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తుందన్నారు. ఇలాగేనా ఆడేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా అత్యంత పకడ్బందీగా ఆడిందని , ఓడి పోయేందుకు కుంటి సాకులు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు గవాస్కర్. ఇరు జట్లకు ఒకే పిచ్ ఉందని మరి భారత్ ఎందుకు ఓడి పోయిందో ఆస్ట్రేలియా ఎందుకు గెలిచిందో భారత జట్టు ఆలోచించు కోవాలని సూచించారు.
ఇలాగేనా ఆడేదంటూ ఫైర్ అయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ దెబ్బకు భారత్ టాప్ ఆర్డర్ కుప్ప కూలిందని , ఇన్నేళ్ల పాటు భారత్ లో ఆడుతున్న ప్లేయర్లకు స్పిన్నర్లతో ఆడిన అనుభవం ఉందని మరి ఏమైందంటూ ప్రశ్నించారు గవాస్కర్(Sunil Gavaskar Slams India Team).
ఒక రకంగా అటు ఆసిస్ తో పాటు ఇటు ఇండోర్ పిచ్ కు తలవంచారంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఆడిన మైదానాలలో భారత జట్టు ఆటగాళ్లు సరైన పరుగులు చేయలేక పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గవాస్కర్(Sunil Gavaskar). ఇదిలా ఉండగా నాలుగు టెస్టుల సీరీస్ లో నాగ్ పూర్ , ఢిల్లీలలో భారత్ గెలుపొందగా ఇండోర్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అహ్మదాబాద్ లో చివరి టెస్టు ఆడాల్సి ఉంది.
Also Read : మహిళా ప్రీమియర్ లీగ్ షురూ