Sanju Samson BCCI : సంజూ శాంసన్ పై ఎందుకీ వివక్ష
ఆసిస్ వన్డే సీరీస్ కు పనికిరాడా
Sanju Samson Squad : కేరళ స్టార్ బ్యాటర్ , రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను కావాలని బీసీసీఐ పక్కన పెడుతోందంటూ క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఎలాంటి పర్ ఫార్మెన్స్ లేకున్నా కొందరిని కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సీరియస్ కామెంట్స్ చేశాడు. కొందరి ఆటగాళ్ల పట్ల ఫెవరిటిజం పని చేస్తోందని అందుకే వాళ్లు జట్టులో ఎంపికవుతూ వస్తున్నారని సంచలన కామెంట్స్ చేశాడు.
ఈ తరుణంలో అద్భుతంగా ఏ ఫార్మాట్ లోనైనా రాణించ గలిగే సత్తా కలిగిన సంజూ శాంసన్ ను ఎందుకు ఎంపిక చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా బీసీసీఐని నిలదీశాడు.
రాజకీయాలు చోటు చేసుకోవడం వల్లనే తమ రాష్ట్రానికి చెందిన స్టార్ శాంసన్ ను(Sanju Samson Squad) పక్కన పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రతిభ కలిగిన వాళ్లను ఎంపిక చేస్తారని కానీ బీసీసీఐ తమ పట్ల అణుకువగా ఉండే వారి పట్ల ఫేవర్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇక సంజూ శాంసన్(Sanju Samson) ను బీసీసీఐ పూర్తిగా పక్కన పెట్టేసిందా అన్న అనుమానం నెలకొంది. విదేశీ లీగ్ లు ఆడేందుకు అతడిని విడుదల చేయండని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సీరీస్ కు ఎంపిక చేయక పోవడం పూర్తిగా వివక్ష చూపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2013లో చివరగా వన్డే ఆడిన జయదేవ్ ఉనాద్కత్ ను జట్టులోకి తీసుకున్నరాని శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారంటూ ప్రశ్నించారు. శాంసన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ 11 వన్డేల్లో 66 సగటుతో 330 రన్స్ చేశాడు.
Also Read : భారత్ పరాజయం గవాస్కర్ ఆగ్రహం