Vivek Agnihotri Rahul : రాహుల్ ను ఎగ‌తాళి చేసిన డైరెక్ట‌ర్

అహింస‌కు ఉగ్ర‌వాదుల ప‌రిష్కారం

Vivek Agnihotri Rahul : కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీలో కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది ప్ర‌మాదంలో ప‌డింద‌న్నారు. దీంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ పెద్ద ఎత్తున రాహుల్ ను టార్గెట్ చేసింది. దేశం ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీసేందుకే రాహుల్ గాంధి ఇలా మాట్లాడారంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌, మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బీజేపీ అధికార ప్ర‌తినిధి సంబిత్ పాత్రా నిప్పులు చెరిగారు.

తాజాగా వీరి జాబితాలోకి చేరి పోయారు కాశ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri Rahul). రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. ఉగ్ర‌వాదులు వ‌స్తార‌ని అహింసా మార్గంలో ప‌రిష్క‌రిస్తారంటూ ఎగ‌తాళి చేశారు.

ఉగ్ర‌వాదులను గుర్తించిన సంఘ‌ట‌న‌ను భ‌ద్ర‌తా సంస్థ‌ల‌కు ఎందుకు రాహుల్ గాంధీ చెప్ప‌లేదంటూ నిల‌దీశారు. ఇక వివేక్ అగ్నిహోత్రి అయితే సీరియ‌స్ గా స్పందించారు. ఆయ‌న మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రిని వ‌క‌ల్తా పుచ్చుకున్నారు.

ఆయ‌న తీసిన సినిమా అది మూవీనే కాదంటూ గోవా ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో జ్యూరీ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్నారు డైరెక్ట‌ర్ (Vivek AgnihotrI). భార‌త్ జోడో యాత్ర స‌మ‌యంలో తాను ఉగ్ర‌వాదుల‌ను దూరం నుండి చూశాన‌ని చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఒక ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిప‌డ్డారు. అస‌లు దేశానికి ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో స్ప‌ష్టం చేయాల‌న్నారు.

Also Read : ఫాక్స్ కాన్ ఒప్పందం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!