Deepika Padukone : దీపికా పదుకొనేకు అరుదైన గౌరవం
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో
Deepika Padukone Oscars : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఆస్కార్ అవార్డుల కోసం. ఇప్పటికే భారత దేశం తరపున ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ప్రశంసలు అందుకుంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది ఆస్కార్ అవార్డుల కమిటీ. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone Oscars) కు అరుదైన గౌరవం దక్కింది. అవార్డులను అందజేసే కమిటీలో ఆమెకు చోటు దక్కింది.
అంతే కాకుండా తెలంగాణకు చెందిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన నాటు నాటు సాంగ్ ప్రదర్శనకు నోచుకోనుంది. దీనిని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. దీనికి సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. దీనిని లైవ్ లో పాడనున్నారు రాహుల్ సిప్లిగంజ్ , కాల భైరవ. మొదటిసారి ఒక భారతీయ నటికి అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనే అవకాశం దీపికా పదుకొనేకు దక్కింది. సామాజిక మాధ్యమాలలో ఆమెకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
బాలీవుడ్ నటితో పాటు ఎమిలీ బ్లంట్ , శామ్యూల్ ఎల్ జాక్సన్ , గ్లెన్ క్లోజ్ , డ్వేన్ జాన్సన్ , మైఖేల్ బి జోర్డాన్ , జానెల్లె మోనే , జో సల్దానా, జెన్నిఫర్ కన్నెల్లీ , రిజ్ అహ్మద్ , మెలిస్సా మెక్ కార్తీ తో కలిసి అవార్డులను అందజేయనున్నారు నటి దీపికా పదుకొనే. ఆమె ఇటీవల బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి నటించిన పఠాన్ మూవీ కోట్లను కొల్లగొట్టింది. ప్రియాంక చోప్రాతో పాటు దీపికా(Deepika Padukone) కూడా హాలీవుడ్ సీరియల్ లో నటించింది. ఈ సందర్భంగా తనకు ఛాన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు దీపికా పదుకొనే.
Also Read : రాహుల్ ను ఎగతాళి చేసిన డైరెక్టర్