Yediyurappa Comment : ‘యెడ్డీ’నే కీలకం బీజేపీ ప్రచార అస్త్రం
మాజీ సీఎంకు హైకమాండ్ ప్రయారిటీ
Yediyurappa Comment : అందరి కళ్లు కన్నడనాట ఏం జరుగుతుందనే దానిపై ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా, నాలుగుసార్లు సీఎంగా కొలువు తీరిన..కాకలు తీరిన రాజకీయ యోధుడిగా పేరు పొందిన బీఎస్ యెడియూరప్ప మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
ఆయనను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చేసిన ప్రయత్నం ఫలించ లేదు సరికదా కర్ణాటకలో ఒక బ్రాండ్ గా, తన కంటూ ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న యెడ్డీని కాదనుకుండా ఎన్నికల్లో ముందుకు వెళ్లలేమని గ్రహించింది.
అందుకే సాక్షాత్తు ఎన్నికలలో విజయ సారథిగా పేరు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా సైతం ఇప్పుడు యెడ్డీని ముందుకు తీసుకు రాక తప్పని పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం బీజేపీని పవర్ లోకి తీసుకు రావడంలో మాజీ సీఎం చేసిన కృషి మరువలేం. ఆయన పాత్ర ప్రతి రంగంలో..ప్రతి అడుగులో ఉంది.
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా, ప్రతిపక్షాలు విమర్శలు లెక్కలేనంతగా చేసినా ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళుతుండడం యెడియూరప్ప ప్రత్యేకత. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ గుజరాత్ లో చరిత్ర సృష్టించింది.
తాజాగా ఈశాన్య రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కలిసి కాషాయ జెండాను ఎగుర వేసింది. కానీ కర్ణాటకలో మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
అవినీతి, అక్రమాలకు సర్కార్ అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రూ. 6 కోట్లతో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో పట్టుబడ్డాయి. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన అస్త్రంగా మారింది.
ఇక కర్ణాటకలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఈ కమ్యూనిటీ అనాది నుంచి ప్రభావం చూపుతూ వస్తోంది. ఏ పార్టీ వచ్చినా లేదా అధికారంలో ఉన్నా వీరికి తల వంచాల్సిందే.
ఎందుకంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో 70 శాతానికి పైగా ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలను లింగాయత్ ఓటర్లు ప్రభావం చూపనున్నారు.
అందుకే లింగాయత్ వర్గానికి ప్రతినిధిగా ఉంటూ వచ్చారు మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప(Yediyurappa Comment). ఆయనను కాదని ముందుకు వెళితే అది బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రహించింది.
గతంలో ఎన్నడూ లేనంతగా ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెట్టింది. ఎన్నికల కోసం మాజీ సీఎంను మస్కట్ గా మార్చేసింది. ప్రతి సందర్బంలోనూ, సభల్లోనూ, ర్యాలీల్లోనూ యెడ్డీని ముందుకు తీసుకు వస్తోంది.
ఇటీవల జరిగిన సభల్లో ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. యెడియూరప్ప వల్లనే పార్టీకి పేరు వచ్చిందంటూ కితాబు ఇచ్చారు. ఏది ఏమైనా కర్ణాటకలో మాజీ సీఎం మాస్ లీడర్ గా ఉన్నారు.
ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ పార్టీ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. 80వ పుట్టిన రోజు శివమొగ్గలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు పీఎం.
ఆయన చేసిన కృషి స్పూర్తి దాయకం అంటూ పేర్కొన్నారు. యెడియూరప్ప ప్రసంగం ముగించగానే మోదీ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతించారు. ప్రజా జీవితంలోని ప్రతి వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక అమిత్ షా అయితే ప్రధాని మోదీ, యడియూరప్పలపై విశ్వాసం ఉంచాలని కోరారు.
దీని వల్ల లింగాయత్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేలా చూడడంలో భాగంగానే యెడియూరప్పను ముందుకు తీసుకు వస్తున్నట్లు అర్థమవుతోంది.
Also Read : ఆప్ ఎమ్మెల్యేపై ఎన్సీపీసీఆర్ ఫైర్