Chhattisgarh Budget 2023 : నిరుద్యోగులకు రూ. 2,500 పెన్షన్
ప్రకటించిన ఛత్తీస్ గఢ్ సీఎం బఘేల్
Chhattisgarh Budget 2023 : ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. కొత్త బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు రూ. 2,500 నెల నెలా పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కార్ నెల వారీ భృతిని అందజేస్తున్నట్లు తెలిపారు సీఎం భూపేష్ బఘేల్. సోమవారం ఛత్తీస్ గఢ్ బడ్జెట్ 2023ని సమర్పించారు.
రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో రాష్ట్ర బడ్జెట్ 2023-24 తుది మెరుగులు దిద్దారు. అంతే కాకుండా ఛత్తీస్ గఢ్ సర్కార్ అంగన్ వాడీ కార్యకర్తల నెల వారీ గౌరవ వేతనాన్ని రూ. 6,500 నుంచి రూ. 10,000కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 1న ప్రాంరభం అయ్యాయి. ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భూపేష్ బఘేల్ సర్కార్ చేపట్టిన చివరి రాష్ట్ర బడ్జెట్ ఇదే.
రాయ్ పూర్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారక ఆస్పత్రిలో 700 పడకల ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ భవనం అభివృద్దికి రూ. 85 కోట్ల కేటాయింపు చేశారు సీఎం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటుకు బడ్జెట్ లో రూ. 5 కోట్లు కేటాయించామని భూపేష్ బఘేల్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్(Chhattisgarh Budget 2023) మన రాష్ట్ర కలలకు కొత్త వాస్తవికతను ఇస్తుందన్నారు సీఎం.
Also Read : ప్రచారం కోసం రాహుల్ దుష్ప్రచారం