Sania Mirza Comment : సానియా మీర్జా ‘అల్విదా’
దేశం గర్వించిన క్రీడా దిగ్గజం
Sania Mirza Comment : తను ఎక్కడ క్రీడా జీవితాన్ని ప్రారంభించిందో అక్కడే ముగింపు పలికింది టెన్నిస్ క్రీడా దిగ్గజం సానియా మీర్జా. హైదరాబాద్ వేదికగా లాల్ బహదూర్ మైదానంలో వేలాది మంది హర్ష ధ్వానాల మధ్య సానియాకు ఘనంగా వీడ్కోలు పలికింది.
20 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం పాటు నిరాటంకంగా కొనసాగడం మామూలు విషయం కాదు. ఇన్నేళ్లుగా నెట్టుకు రావడం మామూలు విషయం కాదు.
అందంతో పాటు ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంది సానియా మీర్జా. సానియా అంటే ఓ బ్రాండ్. ఓ అద్భుతమైన ఇమేజ్. ఆమె వల్ల భారత దేశానికి ఘనమైన పేరు వచ్చిందన్నది వాస్తవం.
సంప్రదాయమైన ముస్లిం కుటుంబానికి చెందిన ఓ మహిళ యావత్ క్రీడా లోకం విస్తు పోయేలా తనను తాను మల్చుకున్న వైనం ఎందరికో పాఠం కావాలి. అడ్డంకుల్ని, అవమానాలను తట్టుకుని నిలబడింది.
ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ ను పెళ్లి చేసుకోవడం తన కెరీర్ పై, తన వ్యక్తిత్వంపై దాడి జరిగిన సమయంలో కూడా సానియా సంయమనం కోల్పోలేదు.
మరో వైపు విడాకుల రూమర్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా తట్టుకుని నిలబడింది. ఏది ఏమైనా సానియా మీర్జాది(Sania Mirza Comment) అద్బుతమైన కథ.
జనవరి 19న సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన ఉక్రేనియన్ భాగస్వామి నదియా కిచెనోక్ తో మహిళల డబుల్స్ లో మొదటి రౌండ్ లో ఓడి పోయిన తర్వాత ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఈ ఏడాది తన చివరిది అని ప్రకటించింది.
సమస్త టెన్నిస్ లోకం విస్తు పోయింది ఆమె ప్రకటనతో. ఏదో ఒక రోజు ఎంత ఎత్తుకు ఎదిగినా..ఎన్ని అవార్డులు సంపాదించినా, ఎన్ని రికార్డులు నెలకొల్పినా ఆట నుంచి నిష్క్రమించు కోవాల్సిందే.
మీర్జా రెండు దశాబ్దాలకు పైగా భారత టెన్నిస్ కు టార్చ్ బేరర్ గా ఉంటూ వచ్చారు. సెరెనా విలియమ్స్ తో ఓడి పోయింది..కానీ తనకు , భారతీయ క్రీడాకారిణులకు కొత్త వారసత్వాన్ని సృష్టించింది. పీటీ ఉష , నైనా నెహ్వాల్, పీవీ సింధు కంటే ముందు సానియా మీర్జా భారత దేశానికి చెందిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా నిలిచి పోయింది.
స్విస్ కు చెందిన రోజర్ ఫెడరర్ , స్పెయిన్ కు చెందిన రాఫెల్ నాదల్ తో పాటు అదే కాలంలో ప్రజాదరణ పొందారు. చాలా మంది భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఎక్కువగా ఇష్ట పడేందుకు కారణం సానియా మీర్జా ఆట తీరే.
ఆమె అత్యంత విజయవంతమైన టెన్నిస్ ప్లేయర్ గా ప్రూవ్ చేసుకుంది. 2003 నుండి 2013 దాకా నెంబర్ నెంబర్ 1, 2007లో వరల్డ్ వైడ్ గా నెంబర్ 27వ ర్యాంకు సాధించింది.
ఆన్ కోర్ట్ విజయాలలో డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ గా నిలవడం మామూలు విషయం కాదు. 2005లో టైమ్ మ్యాగజైన్ లో ప్రత్యేక సంచిక ముఖ చిత్రంపై మెరిసింది సానియా మీర్జా(Sania Mirza). 2016లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో కూడా నిలిచింది.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ చేసిన కామెంట్స్ ను గుర్తు చేసుకోవాలి. సానియా అంటే బ్రిలియంట్..ఆత్మ విశ్వాసం..బలం, స్థైర్యం..టెన్నిస్ ను మించి పోయింది. ఆమె ఒక తరం భారతీయుల కలలను సాకారం చేసుకునేలా ప్రేరేపించిందన్నారు.
భారత దేశ జాతీయ జెండాను ఎన్నో సార్లు ఎగుర వేసేలా చేసింది. నిన్నటి తరమే కాదు నేటి తరం..రేపటి తరానికి సానియా మీర్జా దిక్సూచి.
Also Read : సానియా మీర్జా దేశానికి గర్వ కారణం