RCB vs MI WPL 2023 : ముంబై ఇండియ‌న్స్ గ్రాండ్ విక్ట‌రీ

హేలీ మ్యాథ్యూస్ షాన్ దార్ ఇన్నింగ్స్

RCB vs MI WPL 2023 : హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ లో దంచి కొడుతోంది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో స‌త్తా చాటింది.

తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ ను 143 ర‌న్స్ తో మ‌ట్టి క‌రిపించిన ముంబై ఇండియ‌న్స్ మ‌రోసారి ఇదే రీతిన ఆట తీరును ప్ర‌ద‌ర్శించి ఔరా అనిపించేలా చేసింది. మొద‌టి మ్యాచ్ లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది కౌర్. ఇక హేలే మాథ్యాస్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది.

కేవ‌లం 38 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న హేలీ ఏకంగా 77 ర‌న్స్ చేసింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు(RCB vs MI WPL 2023) చుక్కలు చూపించింది. ముంబై ఇండియ‌న్స్ 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

మొద‌ట ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం 14.2 ఓవ‌ర్ల‌లో భారీ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ ఛేదించింది. హేలే మ్యాథ్యూస్ 13 ఫోర్లు ఓ సిక్స‌ర్ తో దుమ్ము రేపింది.

మ్యాచ్ లో తానే ద‌గ్గ‌రుండి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. చివ‌రి వ‌ర‌కు నాటౌట్ గా నిలిచింది. 77 ర‌న్స్ తో పాటు కీల‌క‌మైన 3 వికెట్లు తీసింది. హేలీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ పొందింది. అంత‌కు ముందు స్మృతీ మంధాన టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 18.4 ఓవ‌ర్ల‌లోనే 155 ర‌న్స్ కు చాప చుట్టేసింది. మంధాన 23 ర‌న్స్ చేస్తే రిచా ఘోష్ 28 ప‌రుగులు చేసింది. మిగతా ఆట‌గాళ్లు రాణించ లేదు.

Also Read : హేలీ మ్యాథ్యూస్ జోర్దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!