Syeda Salva Fatima : పరదా దాటుకుని పైలట్ అయిన ఫాతిమా
మొట్ట మొదటి వాణిజ్య పైలట్ గా గుర్తింపు
Syeda Salva Fatima : సయ్యద్ సాల్వా ఫాతిమా ఒక్కసారిగా దేశం తన వైపు చూసుకునేలా చేశారు. ఆమె పరదా సంస్కృతి నుంచి తనను తాను ప్రూవ్ చేసుకుని మొదటి కమర్షియల్ (వాణిజ్య) పైలట్ గా నిలిచారు. ముస్లిం సంప్రదాయ కుటుంబం నుంచి ఇలాంటి ఫీట్ సాధించడం మామూలు విషయం కాదు. కానీ ఆమె సాధించారు. నిరాశ నిస్పృహల్లో కొట్టు మిట్టాడుతున్న నేటి తరం యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించ గలదని నిరూపించారు సయ్యదా సాల్వా ఫాతిమా.
ఆమె స్వస్థలం హైదరాబాద్. ఆమె హిజాబ్ ధరిస్తూనే పైలట్ గా అవతరించింది. ఎవరైనా ఆకాశంలోకి ఎగరాలని అనుకుంటారు. కానీ పైలట్ కావడం అంటే మామూలు విషయం కాదు. కేవలం పురుషులు మాత్రమే దానిని నిర్వహించాలని కోరుకుంటారు. కానీ సయ్యదా సాల్వా ఫాతిమాకు ముందు నుంచి తను పైలట్ కావాలని కోరిక. దానిని బలంగా నమ్మింది. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. చివరకు విజేతగా నిలిచింది. ఇవాళ చరిత్రలో తన పేరు ఉండేలా చేసుకుంది.
సయ్యదా సాల్వా ఫాతిమా వయస్సు 30 ఏళ్లు. హైదరాబాద్ నుండి మొదటి మహిళా వాణిజ్య పైలట్ గా (Syeda Salva Fatima) నిలిచారు. నగరంలో బేకరీని కలిగి ఉన్న సయ్యద్ అష్పాక్ అహ్మద్ కూతురు ఫాతిమా. ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినా పేరెంట్స్ ఆమెను పైలట్ అయ్యేందుకు ప్రోత్సహించారు.
తన కలల వృత్తిని సాకారం చేసుకునేందుకు ప్రొఫెసర్లలో ఒకరి సాయం పొందింది. సయ్యదా సాల్వా ఫాతిమా ఓ ప్రైవేట్ విమాయాన సంస్థలో పని చేస్తోంది పైలట్ గా. భారత దేశంలో వాణిజ్య పైలట్ లైసెన్స్ పొందిన కొద్ది మంది ముస్లిం మహిళలలో ఫాతిమా ఒకరు.
Also Read : సక్సెస్ కు కేరాఫ్ స్వాతి పిరామల్