Youngest Organ Donor : అవయవ దానంలో ఆమె ఆదర్శం
దేశంలోనే అతి పిన్న వయస్కురాలు
Youngest Organ Donor : అవయవ దానం అనేది మరో జీవితాన్ని ఇవ్వడం. ఈ మధ్య ఇద్దరు దేశంలో ప్రధానంగా వార్తల్లో నిలిచారు. ఒకరు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య. మరొకరు త్రీస్సూర్ లో కాన్వెంట్ స్కూల్ లో చదువుకుంటున్న దేవానంద. ఆమె న్యాయ పోరాటంలో కూడా గెలిచి చరిత్ర సృష్టించారు. ఇద్దరూ తమ అవయవాలను దానం చేసి తమ తండ్రులను నిలబెట్టారు. ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారు.
దేవానందకు 17 ఏళ్లు. ఆమె కాలేయంలో కొంత భాగాన్ని తన తండ్రికి విరాళంగా ఇచ్చింది. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు కలిగిన అవయవ దాతగా గుర్తింపు పొందింది. చరిత్ర సృష్టించింది. ఆమె తండ్రి ప్రతీష్ . త్రిసూర్ లో ఒక కేఫ్ ను కలిగి ఉన్నారు. కాలుకు గాయం కావడం , అది ముదిరి కాలేయం దెబ్బ తినడం, క్యాన్సర్ గా మారడం జరిగింది. కాలేయ మార్పిడి జరిగితేనే కానీ బతకడం కష్టమని తేల్చారు. ఎంతో మందిని అడిగారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు.
రోజు రోజుకు ప్రతీష్ పరిస్థితి మరింత దిగజారుతోంది. దీనిని గమనించింది దేవానంద. తండ్రిని కాపాడేందుకు తానే ముందుకు వచ్చింది. త్రీస్సూర్ సేక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ లో దేవానంద చదువుకుంటోంది. ఆమె తన కాలాయాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కానీ ఆమెకు 17 ఏళ్లు కావడంతో చట్టం ఒప్పుకోదని వైద్యులు అభ్యంతరం తెలిపారు. 1994 చట్టం ప్రకారం 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారే అవయవ దానం చేయాలి.
అంతకంటే తక్కువ ఉంటే వీలు కుదరదు. దేవానంద కోర్టును ఆశ్రయించింది. తాను నేరం చేయడం లేదని తన తండ్రి ప్రాణం పోకుండా ఉండేందుకే అవయవ దానం(Youngest Organ Donor) చేస్తున్నట్లు తెలిపింది. కోర్టు దేవానందను అభినందించింది. చివరకు అలువా లోని రాజగిరి ఆస్పత్రిలో ఆపరేషన్ రిగింది. వైద్య ఖర్చులను మాఫీ చేసింది. కేరళ సీఎం పినరయ్ విజయన్ దేవానందను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి యువతులే దేశానికి కావాలి.
Also Read : మహిళా దినోత్సవం సరే గుర్తింపేది