Sarbari Dutta Alpha Coach : జీవితం నేర్పిన పాఠం దత్తా విజయం
మైండ్ కోచింగ్ లో మోస్ట్ పాపులర్
Sarbari Dutta Alpha Coach : లైఫ్ స్కిల్స్ అనేది ఇవాళ అత్యంత ప్రాముఖ్యంగా మారింది. సాంకేతికత ప్రాముఖ్యత వహిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి నైపుణ్యాలు తప్పనిసరి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా తయారు చేయడంలో మైండ్ కోచ్ లు కీలకంగా వ్యవహరిస్తారు. వారిలో మైండ్ కోచ్ లుగా పేరు పొందారు సర్బరీ దత్తా. అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. ఆల్ఫా స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ను ఏర్పాటు చేశారు. మైండ్ పవర్ నిపుణురాలిగా సేవలు అందిస్తున్నారు.
సర్బరీ దత్తా(Sarbari Dutta Alpha Coach) ప్రగతిశీల బెంగాలీ కుటుంబంలో పుట్టారు. పేరెంట్స్ కు ఒక్కరే. తండ్రి పశువుల డాక్టర్. తల్లి గృహిణి. కూతురుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆమె పరిమితులు లేని బాల్యాన్ని గడిపారు. మొదట్లో ఆమె కల డాక్టర్ కావాలని. కానీ జేఈఈ పరీక్షలో సక్సెస్ కాలేక పోయారు. లైఫ్ లో మొదటి వైఫల్యం. ఇదే సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోలేదు. జీవితం నేర్పిన పాఠాలే ఇవాళ కోచ్ గా నిలిచేలా చేసిందని అంటారు సర్బరీ దత్తా.
కోల్ కతా యూనివర్శిటీలో ఆనర్స్ డిగ్రీ చదివారు. బిఇడీ కూడా చేశారు. గ్లాక్సో ఇండియాలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేశారు. నాలుగేళ్ల పాటు కొనసాగారు. విద్యా వేత్తగా మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే తన జీవిత కోణాన్ని పూర్తిగా మార్చేసింది. టీచర్ గా, మెంటార్ గా, యువత జీవితంలో సానుకూల మార్పును కలిగించే పాత్రను ఆస్వాదించేలా చేశారు. ఎన్ఎల్పీ ప్రాక్టీసనర్ గా, మైండ్ కోచ్ గా ప్రూవ్ చేసుకున్నారు. 2019లో ఆల్ఫా స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్ ను స్టార్టప్ గా ప్రారంభించారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ కోచ్ గా సక్సెస్ అయ్యారు సర్బరీ గుత్తా(Sarbari Dutta).
Also Read : అవయవ దానంలో ఆమె ఆదర్శం