Divya Aggarwal Kazo : క్రియేటివిటీ సొంతం ‘దివ్యా’నందం
మహిళల ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ కాజో
Divya Aggarwal Kazo : వ్యాపార రంగంలో మహిళలకు సంబంధించిన వస్తువులు, ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటోంది. ఆభరణాలు, కాస్మెటిక్స్ , లో దుస్తులు, పాదరక్షలు ఇలా ప్రతి ఒక్కటి ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చేశాయి. వీటి మీదే ఫోకస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్లు వందల్లో ఉన్నా కాజో మాత్రం వెరీ డిఫరెంట్ అని చెప్పక తప్పదు.
ఇది ప్రముఖ దేశీయ పరంగా అత్యంత ప్రాముఖ్యత సాధించిన వ్యాపార ఫ్యాషన్ బ్రాండ్. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా దివ్య అగర్వాల్ దేనని చెప్పక తప్పదు. ప్రస్తుతం కాజో ఫ్యాషన్ బ్రాండ్ సంస్థకు క్రియేటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.
అంకిత భావం, ఉద్వేగ భరితం , దూర దృష్టి కలిగిన నాయకురాలిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు ఆమె. చాలా చిన్న వయస్సు నుండి ఫ్యాషన్ , ఫాబ్రిక్ పై ఫోకస్ పెట్టారు. ఈ రెండు రంగాలంటే దివ్య అగర్వాల్ కు(Divya Aggarwal Kazo) వల్లమాలిన అభిమానం కూడా. ఉన్నత పాఠశాల రోజులలో లలిత కళలో. చివరకి ఫ్యాషన్ డిజైన్ పై ఆసక్తిని పెంచేలా చేశారు.
ఆమెకు ఇప్పుడు 25 ఏళ్లు. హైస్కూల్ విద్యను న్యూ ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్ నుండి పూర్తి చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో మేజర్ , డిజైన్ మేనేజ్ మెంట్ లో మైనర్ తో న్యూయార్క్ నగరంలోని పార్సన్స్ ఆఫ్ డిజైన్ నుండి బీఎఫ్ఏ కూడా పూర్తి చేశారు.
దివ్య అగర్వాల్ ప్రయోగాత్మక సవాళ్లపై దృఢ విశ్వాసం కలిగి ఉంటారు. న్యూయార్క్ లో స్థిర పడాలని అనుకుంది. కానీ కాజో ఫౌండర్ గా సక్సెస్ ఫుల్ అవుతుందని ఆమె అనుకోలేదు. సవాళ్లు లేకుండా ఏ ఒక్కరికీ సక్సెస్ దొరకదని అంటారు. పోటీతత్వం అన్నది ప్రతిచోటా ఉంటుందని దాని గురించి ఆందోళన చెందితే కష్టమని పేర్కొంటారు దివ్య అగర్వాల్.
Also Read : డిజైనింగ్ లో శృతి జైపురియా శభాష్