Anushka Shah : సివిక్ స్టూడియోస్ మాస్ వాయిస్
వినోద రంగంలో అనుష్క అదుర్స్
Anushka Shah : వినోద రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏకంగా ఓ మహిళ స్టూడియోను ఏర్పాటు చేయడం దాంతో ఆదాయాన్ని గడించడం మామూలు విషయం కాదు. అనుష్క షా సివిక్ స్టూడియోస్ ను స్థాపించారు. వినోదంతో మార్పును సృష్టించేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ముంబైలో ఉన్న ప్రొడక్షన్ హౌస్ ను రూపొందించారు. మెల మెల్లగా వినోద పరిశ్రమలో తనకంటూ ముద్ర వేశారు. కంటెంట్ కోసం మాట్లాడుకునేలా చేశారు అనుష్క షా(Anushka Shah).
పాతాల్ లోక్ , మీర్జా పూర్ , స్త్రీ, బాలా తో పాటు మరెన్నో చిత్రాలకు పని చేశారు . అభిషేక్ బెనర్జీ నటించిన ప్రాజెక్టులలో ఒకటైన వకీల్ బాబు ఇటీవల 2022కి న్యూయార్క్ ఫెస్టివల్ లో చేరుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు సుమిత్ పురోహిత్. సివిక్ స్టూడియోస్ ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందిన లీగల్ డ్రామా జాతీయంగా, అంతర్జాతీయంగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లలో గొప్ప గుర్తింపు పొందింది.
ఇందులో న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ , 52వ వార్షిక యుఎస్ఏ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నాయి. ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఏషియా టొరొంటో, 14వ అంతర్జాతీయ డాక్యుమెంటరీ , షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ , 13వ వార్షిక చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ఉన్నాయి. సివిక్ స్టూడియోస్ వినోద శక్తి ద్వారా పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో సాగుతోంది.
ప్రజల హక్కులు, వివిధ సంస్కరణలు , విధానాల గురించి అవగాహన పెంపొందించడం దీని ఉద్దేశం. వినోదం ద్వారా సమాజ ప్రతినిధులకు సామాన్యుడికి మధ్య అంతరాన్ని తగ్గించే పనిలో పడింది. ప్రతికంటెంట్ లో ప్రజాస్వామ్యం ఆలోచనను బలోపేతం చేయడం. టీవీ, ఫిల్మ్ లు, వెబ్ సీరీస్ లు, రేడియో, డిజిటల్ మడియా మాధ్యమాలకు అందించడం.
Also Read : క్రియేటివిటీ సొంతం ‘దివ్యా’నందం