Modi Anthony 4th Test : అహ్మ‌దాబాద్ టెస్టుకు మోదీ ఆంటోనీ

చ‌రిత్రలో నిలిచి పోనున్న మోదీ మైదానం

Modi Anthony 4th Test : ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ప్ర‌సిద్ది చెందింది గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియం. ఇందులో ఏక కాలంలో ల‌క్ష మందికి పైగా కూర్చునే స‌దుపాయం ఉంది. అక్క‌డ క్రీడాకారుల‌కు కావాల్సిన స‌దుపాయాలు కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేర‌కు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. గ‌త ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఫైన‌ల్ మ్యాచ్ మోదీ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగింది. ఆ త‌ర్వాత మ‌రో కీల‌క‌మైన నాలుగో టెస్టు మ్యాచ్ భార‌త , ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య గురువారం జ‌ర‌గ‌నుంది.

ఈ టెస్టుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఎందుకంటే ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇద్ద‌రు ప్ర‌ధాన‌మంత్రులు మ్యాచ్ ను చూసేందుకు రావ‌డం చాలా అరుదు. ఇవాళ భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆంటోనీ ఆల్బ‌నీస్(Modi Anthony 4th Test) హాజ‌రు కానున్నారు. ఇందులో భాగంగా పీఎం మోదీ స్వ‌యంగా మైదానంలో మ్యాచ్ కు సంబంధించి టాస్ వేయ‌నున్నారు. దీనిని ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని జాతీయ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

జి20 గ్రూప్ కు భార‌త దేశం నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. వ‌రుస‌గా స‌మావేశాలు చేప‌ట్టింది. ఇందులో పాల్గొనేందుకు భార‌త్ కు విచ్చేశారు ఆస్ట్రేలియా ప్ర‌ధాన‌మంత్రి ఆంటోనీ ఆల్బ‌నీస్. ఇద్ద‌రు పీఎంలు రానుండ‌డంతో అహ్మ‌దాబాద్ లో భారీ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఇప్ప‌టికే ఇరు దేశాల జ‌ట్లు ఇక్క‌డికి చేరుకున్నాయి.

Also Read : నాలుగో టెస్టుకు భార‌త్ ఆసిస్ సై

Leave A Reply

Your Email Id will not be published!