MI vs DC WPL 2023 : ముంబై భ‌ళా ఢిల్లీ విల‌విల

వ‌రుస విక్ట‌రీల‌తో టాప్

MI vs DC WPL 2023 : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) లో వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్(MI vs DC WPL 2023). రిచ్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 

వ‌రుస‌గా ముంబైకి ఇది మూడో విజ‌యంతో. దీంతో ఆరు పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ జెయింట్స్ పై 143 ర‌న్స్ గెలుపొందింది. రెండో మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై 63 ప‌రుగుల‌తో స‌త్తా చాటింది. తాజాగా జ‌రిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో మ‌ట్టి క‌రిపించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 105 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 18 ఓవ‌ర్ల‌లో చాప చుట్టేసింది. సైకా ఇషాక్ , ఇసా బెల్లె వాంగ్ , హేలీ మ్యాథ్యూస్ చెరో మూడు వికెట్లు తీశారు. ఢిల్లీని క‌ట్ట‌డి చేశారు. ఏ మాత్రం ప‌రుగులు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టారు.

అద్బుత‌మైన బౌలింగ్ తో ముప్పు తిప్ప‌లు పెట్టారు ఢిల్లీ మ‌హిళా క్రికెట‌ర్ల‌ను. ఒకానొక ద‌శ‌లో డిఫెన్స్ ఆడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వ‌లేదు ముంబై బౌల‌ర్లు. అనంత‌రం 106 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది ముంబై ఇండియ‌న్స్(MI vs DC WPL 2023) . 

కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 11 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిస్తే నాట్ స్కివ‌ర్ బ్రంట్ 23 ర‌న్స్ చేసి కీల‌క పాత్ర పోషించింది. అంత‌కు ముందు బ‌రిలోకి దిగిన య‌స్తికా భాటియా దుమ్ము రేపింది. 41 ప‌రుగులతో రాణించింది. ఇక బౌలింగ్ తో పాటు మ‌రోసారి షాక్ ఇచ్చింది హేలీ మ్యాథ్యూస్ . 32 ర‌న్స్ చేసింది. తొలి వికెట్ కు 65 ర‌న్స్ జోడించారు ఇద్ద‌రూ.

Also Read : జెమీమా రోడ్రిగ్స్ స్ట‌న్నింగ్ క్యాచ్

Leave A Reply

Your Email Id will not be published!